గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Mar 01, 2020 , 01:40:55

డీసీసీబీ, డీసీఎంఎస్‌లపై గులాబీ జెండా

డీసీసీబీ, డీసీఎంఎస్‌లపై గులాబీ జెండా


డీసీసీబీ, డీసీఎంఎస్‌లపై గులాబీ జెండా

ఆదిలాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు, రైతులు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు పట్టం కడుతున్నారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో కూడా రైతులు గులాబీ పార్టీ అభ్యర్థులను ఆశీర్వహించారు. ఇటీవల జరిగిన డీసీసీబీ ఎన్నికల్లో 77 పీఏసీఎస్‌లకు టీఆర్‌ఎస్‌ 72 సంఘాలను గెలుచుకుంది. గులాబీ పార్టీకీ చెందిన అభ్యర్థులు చైర్మన్‌లు, వైస్‌ చైర్మన్‌లుగా ఎన్నికయ్యారు. ఈ నెల 25న డైరెక్టర్‌ల ఎన్నికలు నిర్వహించగా డీసీసీబీకి 18 మంది, డీసీఎంఎస్‌కు 10 మంది డైరెక్టర్‌ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. అధికారులు ఉదయం 8.30 గంటల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం సమావేశాన్ని ఏర్పాటు చేసి 9 గంటల నుంచి 11 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. 11.30 గంటలకు నామినేషన్ల పరిశీలన అనంతరం మధ్యా హ్నం 2 గంటల వరకు ఉపసంహరణకు గడువు విధించారు. 


అధిష్టానం ఆదేశాల మేరకు డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి కోలేటి దామోదర్‌ గుప్త షిల్డ్‌ కవర్‌లో జిల్లా కేంద్రానికి చేరుకుని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎవరు నామినేషన్లు వేయా లో సూచించారు. నామినేషన్ల గడువు ముగిసేసరికి టీఆర్‌ఎస్‌కు చెందిన నార్నూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌, వైస్‌ చైర్మన్‌ పదవి కోసం లక్ష్మన్‌చాందా పీఏసీఎస్‌ చైర్మన్‌ రఘునందర్‌రావులు నామినేషన్లు దాఖలు చేశారు. చైర్మన్‌గా కాంబ్లే నాందేవ్‌ పేరును తాంసి పీఏసీఎస్‌ చైర్మన్‌ అడ్డీ భోజారెడ్డి ప్రతిపాదించగా మామడ పీఏసీఎస్‌ చైర్మన్‌ హరీష్‌రావు బలపర్చారు. వైస్‌ చైర్మన్‌గా రఘునందన్‌రావు పేరును చించు శ్రీనివాస్‌ ప్రతిపాదించగా, ఇప్ప సత్యనారాయణ బలపర్చారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా తిప్పని లింగ య్య, వైస్‌ చైర్మన్‌గా మాంతయ్యలు నామినేషన్లు వేశారు.


అంతా ఏకగ్రీవమే.. 

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో భాగంగా నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అధిష్టానం సూచించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గడువు ముగిసే సమయానికి డీసీసీబీ చైర్మన్‌కు, వైస్‌ చైర్మన్‌కు ఒక్కొక్కటి, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌కు ఒక్కో నామినేషన్‌ రావడంతో అభ్యర్థులు ఏకగ్రీవంగా ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన సమయం మధ్యాహ్నం 2 గంటల తర్వాత డీసీసీబీ చైర్మన్‌గా కాంబ్లే నాందేవ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రఘునందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌గా తిప్పని లింగయ్య, వైస్‌ చైర్మన్‌గా కొమరం మాంతయ్యలు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.


ధ్రువపత్రాల అందజేత

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లకు అధికారులు, ప్రజాప్రతినిధులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు. అనంతరం డీసీసీబీ కార్యాలయంలో చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌, వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, డీసీఎంఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ తిప్పని లింగయ్య, వైస్‌ చైర్మన్‌ కొమరం మాంతయ్యలలతోపాటు డైరెక్టర్‌లకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువలతో సన్మానించారు.


logo