ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Mar 01, 2020 , 01:21:11

నేడు ఆర్‌జేసీ సెట్‌

 నేడు ఆర్‌జేసీ సెట్‌

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 11 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి మార్చి 1న ఆర్‌జేసీ సెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల ప్రాంతీయ సమ్వనయాధికారి(ఆర్‌సీఓ) జూపూడి ఏంజిల్‌ పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జి ల్లాలోని 11 పరీక్ష కేంద్రాలలో విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులందరు కేంద్రాలకు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకోవాలని, పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్షకు ప్యాడ్‌, బ్లాక్‌, బ్లూరీఫిల్‌ పెన్నులు తెచ్చుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో మొత్తం 5394 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. వీరిలో 600 మందికి ఆదిలాబాద్‌లో, 600 మందికి బోథ్‌లో, ఇచ్చోడలో 213 మందికి, ఆసిఫాబాద్‌లో 500 మందికి, సిర్పూర్‌(జీ)లో 500 మందికి, సిర్పూర్‌(బీ)లో 409 మందికి, బెల్లంపల్లి(బీ)లో 500 మందికి, బెల్లంపల్లి(జీ)లో 600 మందికి, చెన్నూర్‌లో 500 మందికి, లక్షెట్టిపేటలో 500 మందికి, జైపూర్‌లో 472మందికి కేటాయించామన్నారు. ఇక్కడ ఏఆర్‌సీవో కే.మహేశ్వర్‌రావు ఉన్నారు.


logo