శుక్రవారం 29 మే 2020
Mancherial - Mar 01, 2020 , 01:16:59

ఉత్సాహంగా పారిశుధ్య పనులు..

ఉత్సాహంగా పారిశుధ్య పనులు..

చెన్నూర్‌, నమస్తే తెలంగాణ/మందమర్రి : చెన్నూర్‌, మందమర్రిలో పట్టణ ప్రగతి పనులను శనివారం అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ప నుల తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నా రు. మొదట చెన్నూర్‌ మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించారు. అనంతరం పట్టణ ప్రగతి గురించి మున్సిపాలిటీ కమిషనర్‌ బాపును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అ వగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. యువకులు శ్రమదానం ద్వారా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలను తొలగించి పారిశుధ్య పనులు చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో శిథిలావస్థలో ఉన్న గోడలను కూల్చి వేశారు. ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. వీధిదీపాలను ఏర్పాటు చేశా రు. పలు వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చన గిల్డా, వైస్‌ చైర్మన్‌ నవాజొద్దీన్‌, తదిత రులు పాల్గొన్నారు. 


ముమ్మరంగా పనులు..

‘పట్టణ ప్రగతి’లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించాలని అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మున్సిపల్‌ కమిషనర్‌, వార్డుల ప్రత్యేక అధికారులకు సూచించారు. మందమర్రిలోని 12వ వార్డులో చేపట్టిన పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. అలాగే కాలనీలో డ్రైనేజీని పరిశీలించారు. కాలనీలో ఎక్కువ సింగరేణి క్వార్టర్లు ఉండడంతో కార్మిక కుటుంబాల ప్రజలు రోడ్డును ఆక్రమించిన విషయాన్ని అధికారులు అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రోజువారీ పనుల వివరాలు, వార్డుల్లో చేపట్టాల్సిన పనుల కోసం ప్రణాళికలు పకడ్బందీగా రూపొందించాలని కమిషనర్‌ గద్దె రాజుకు సూచించారు. 7, 9, 11, 12, 13, 14, 17వ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, అనుబంధ మహిళా నాయకులు, కార్యకర్తలు పూడిక, పిచ్చిమొక్కలను జేసీబీ సహాయంతో తొలగించా రు. యాపల్‌ ఏరియాలో ఖాళీ స్థలాను శుభ్రం చేశారు. అలాగే రోడ్ల పక్కను ఉన్న చెత్త కుప్పలను తొలగించి ఆయా వార్డుల ఇన్‌చార్జీలు, ప్రత్యేక అధికారులు పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు.


logo