గురువారం 04 జూన్ 2020
Mancherial - Feb 29, 2020 , 00:28:11

మంచిర్యాలలో పట్టణ ప్రగతి

 మంచిర్యాలలో పట్టణ ప్రగతి

మంచిర్యాల టౌన్‌, నమస్తే తెలంగాణ : మంచిర్యాలలో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఆయన 3వ వార్డు తిలక్‌నగర్‌, 13వ వార్డు భగత్‌నగర్‌, సప్తగిరికాలనీ, 14, 15, 16 వార్డుల్లో చైర్మన్‌ పెంట రాజయ్య, మాజీ చైర్‌పర్సన్‌ వసుంధర, వైస్‌ చైర్మన్‌ ముకేశ్‌గౌడ్‌, కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ చెత్తకప్పలను, మురికి కాలువలను, ఇండ్ల మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. 13వ వార్డులో కౌన్సిలర్‌ నల్ల శంకర్‌ ఆధ్వర్యంలో వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే వార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. 16వ వార్డులో కౌన్సిలర్‌ బోరిగం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడం కోసం విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఐదో వార్డు మజీద్‌వాడలో కౌన్సిలర్‌ సుదమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో చెత్తాచెదారాన్ని తొలగించి మురికి కాలువలను శుభ్రం చేయించారు. 9వ వార్డులో కౌన్సిలర్‌ బొలిశెట్టి సునీత ఆధ్వర్యంలో పవర్‌కాలనీలో శ్రమదానం చేసి పిచ్చిమొక్కలను తొలగించారు. అలాగే అన్ని వార్డుల్లో కౌన్సిలర్లు, స్పెషలాఫీసర్లు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహించారు.logo