బుధవారం 03 జూన్ 2020
Mancherial - Feb 29, 2020 , 00:24:37

ఆకట్టుకున్న వైజ్ఞానిక వేడుక

ఆకట్టుకున్న వైజ్ఞానిక వేడుక

మంచిర్యాల అగ్రికల్చర్‌:  సర్‌ సీవీ రామన్‌ అం దరికీ స్ఫూర్తి ప్రధాత అనీ, ఆయన కనుగొన్న రామన్‌ ఎఫెక్ట్‌ విశ్వ వ్యాప్తమైందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా సైన్స్‌ కేంద్రంలో జిల్లా సైన్స్‌ అధికారి సాయిలు మధుబాబు ఆధ్వర్యంలో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ దేశాని కి నోబెల్‌ బహుమతి తెచ్చిన ఘనత కూడా ఆ యనకే దక్కుతుందన్నారు. విద్యార్థులు ఆవిష్కరణల వైపు దృష్టి సారించి, వినూత్న పరికరాల తయారీలో ముందుండాలని కోరారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో ప్రయోగశాలల అ భివృద్ధి, విజ్ఞానాభివృద్ధిలో ఉపాధ్యాయులే కీలకమనీ, ఉపాధ్యాయులందరి కృషితో జిల్లా వి ద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్నారన్నారు. అంతకు సీవీ రామన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ రమణ, సిబ్బం ది మహమూద్‌, ఫైసల్‌, సువార్త, ఓంప్రకాశ్‌, ఉపాధ్యాయులు మనోహర్‌ పాల్గొన్నారు. 


వైజ్ఞానిక రంగంలో రాణించాలి 

విద్యార్థులు విద్యతో పాటు వైజ్ఞానిక రంగం లో రాణించాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు. శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తాయన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన 300 ప్రదర్శనలను ఎమ్మె ల్యే పరిశీలించారు. ముఖ్యంగా రాకెట్‌ లాంచర్‌, బాం బ్‌ లాంచర్‌, 3డీ ఇమాజిన్‌, పిల్లల వేషాధారణలు అందరిని అలరించాయి. అనంతరం సర్‌ సీవీ రామన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ జోబిన్‌, డీన్‌ సంజీవ్‌, ఏఓ విలాస్‌, సీ బ్యాచ్‌ ఇన్‌చార్జి రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 


logo