శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Feb 27, 2020 , T00:30

గురుకులాల్లో చదవడం.. అదృష్టంగా భావించాలి

గురుకులాల్లో చదవడం.. అదృష్టంగా భావించాలి

రామకృష్ణాపూర్‌ : గురుకుల పాఠశాలల్లో చదవడం విద్యార్థులు అదృష్టంగా భావించాలని  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ డిప్యూటీ సెక్రటరీ సక్రూ నాయక్‌ అన్నారు.  రామకృష్ణాపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం, పాఠశాల ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సక్రూ నాయక్‌ మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. చదవు తోనే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 265 సాంఘిక సంక్షేమ గురుకులాలు నడుస్తున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏండ్ల తర్వాత  రాష్ట్రంలో ఆర్మ్‌డ్‌ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పా టు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి, గురుకులాల సొసైటీ సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌ ప్రవీన్‌కుమార్‌కే దక్కిందన్నారు. గతంలో గురుకుల పాఠశాలలు ప్రారంభించిన కాలంలో గ్రామాలకు వెళ్లి విద్యార్థులను సమీకరించుకొనే స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల సిఫారసు తీసుకొని వచ్చినా సీటు(అడ్మిషన్‌) దొరకని స్థాయికి చేరుకున్నాయని వివరించారు. గురుకుల పాఠశాలల్లో చదవడం అదృష్టంగా భావించాలన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో ఏఆర్‌సీఓ మహేశ్వర్‌రావు, ప్రిన్సిపాల్‌ ఫ్రాన్సిస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ నర్మద, టీజీపీఏ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌నాయ క్‌, స్కూల్‌ కమిటీ అధ్యక్షుడు తిరుమలేశ్‌, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.logo