బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Feb 27, 2020 , T00:20

‘పది’ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

‘పది’ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

మంచిర్యాల అగ్రికల్చర్‌ : జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా నిర్వహించాలని, కేంద్రాల్లో విద్యార్థులకనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మంచిర్యాల జడ్పీ బాలుర పాఠశాల సమావేశ హాలులో పదో  తరగతి పరీక్షలకు సంబంధించి చీఫ్‌ సూపరింటెండెంట్‌ (సీఎస్‌), డిపార్ట్‌మెంట్‌ అధికారు(డీఓ)లు, మండల విద్యాధికారులతో కలిసి  సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణకు జిల్లాలో మొత్తం 58 పరీక్షా కేంద్రాలు (55 రెగ్యూలర్‌, మూడు ప్రైవేటు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అధికారులు పరీక్ష కేంద్రాలను ముందుగా సందర్శించి స్టేషనరీ, ఫర్నిచర్‌, తాగునీరు, శానిటేషన్‌ సౌకర్యాలను పరిశీలించి, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌ అధికారులు, తాసిల్దార్లు, ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం అధికారులకు సమాచారం ఇచ్చి వారి నుంచి సహాయం తీసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో సీఎస్‌లు, డీవోలు విద్యార్థుల సంఖ్య అధారంగా గదులు ఏర్పాటు చేసుకోవాలని, సరిపడా ఇన్విజిలెటర్లను నియమించుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్ట్‌ రోజు డ్యూటీలు రాకుండా చూడాలని, పరీక్ష హాలులోకి విద్యార్థులను పంపించే ముందు క్షుణ్ణం గా తనిఖీలు చేయాలని సూచించారు. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాల న్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు.  పరీక్ష పేపర్లను భద్ర పర్చడానికి పోలీసు స్టేషన్‌లో 22 ట్రంక్‌ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరీక్ష జరిగే రోజు ఉదయం 8 గంటలకు సీఎస్‌లు, డీఓ లు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఉండి సెట్‌ ద్వారా తెలియజేసిన ఆదేశాలు పా టించాలన్నారు. జిల్లా విద్యా శాఖ కార్యాలయ పరీక్షల విభాగం అసిస్టెం ట్‌ కమిషనర్‌ దామోదర్‌ రావు, ఎంఈ ఓలు, సీఎస్‌లు, డీవోలు పాల్గొన్నారు. 


logo