శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Feb 26, 2020 , 23:27:30

సీఎం గిరి వికాస పథకంతో మేలు

సీఎం గిరి వికాస పథకంతో మేలు

కాసిపేట : గిరిజన రైతుల అభ్యున్నతికి సీఎం గిరి వికాస పథకం ఎంతో మేలు చేస్తుందని ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య పేర్కొన్నారు. సీఎం గిరి వికాస పథకంపై బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు పథకం అమలుకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.  గిరిజన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ, జడ్పీటీసీ కోరారు. గిరిజన రైతులు ఇద్దరిని గ్రూప్‌గా చేసి వ్యవసాయానికి బోరు లేదా నీటి వసతి కల్పించడం పథకం ఉద్దేశమని ఎంపీడీఓ ఎంఏ అలీం తెలిపారు. దీనిలో ఈజీఎస్‌, రెవె న్యూ, మండల పరిషత్‌, విద్యుత్‌, ఫారెస్ట్‌ అధికారులతో కమిటీ ఉంటుందన్నారు. కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులకు నీటి వసతికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గిరిజన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు.కార్యక్రమంలో ఎంపీఓ మేఘ మాల, ఏపీఓ స్వాతి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

వేమనపల్లి  : గిరి వికాసం పథకంపై స్థాని క మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో లక్ష్మీనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గిరిజన రైతుల భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని  గిరి వికాసం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ఈ పథకం గురించి వివరించారు. స మావేశంలో ఏపీవో సత్య ప్రసాద్‌, ట్రాన్స్‌కో ఏఈ రాజశేఖర్‌, ఏఈవో సంతోష్‌, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. 


logo