టాలీవుడ్ యాక్టర్ పవన్‌కల్యాణ్ లేటెస్ట్ ప్రాజెక్టు వకీల్‌సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్, నివేదాథామస్, అంజలి ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ వకీల్‌సాబ్ నుంచి కంటిపాప సాంగ్‌ను విడుదల చేశారు. ‘కంటిపాప కంటిపాప చెప్పనైన లేదే..నువ్వంతలా అలా చెప్పనైనలేదే..నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా..కాలి మువ్వ కాలి మువ్వ సవ్వడైన లేదే’ అంటూ శృతిహాసన్, పవన్ మధ్య సాగే ట్రాక్ మ్యూజిక్ లవర్స్ కు కనువిందు చేస్తోంది.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎస్ థమన్, అర్మాన్ మాలిక్,దీపు, గీతా మాధురి పాడారు. ఎస్ థమన్ కంపోజ్ చేసిన మగువా మగువా, సత్యమేవ జయతే పాటలకు మంచి స్పందన వస్తుంది. పింక్ రీమేక్‌గా తెరకెక్కుతున్న వకీల్‌సాబ్‌ను దిల్ రాజు-బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.