మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Feb 26, 2020 , 03:42:23

సేవాలాల్‌ ఆశయాలు సాధించాలి

సేవాలాల్‌ ఆశయాలు సాధించాలి

మంచిర్యాల అగ్రికల్చర్‌: ఆదర్శనీయుడు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అనీ, ఆయన ఆశయాల సాధనకు పాటుపడాలని ఆధ్యాత్మిక కుల గురువు ప్రేంసింగ్‌ మహరాజ్‌ పిలుపునిచ్చారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సేవాలాల్‌ జయంతి సభకు మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీ వహింస చేయవద్దనీ, మూఢ నమ్మకాలు వీడాలనీ, వ్యసనాలకు బానిస కావద్దని విస్తృత ప్రచారం చేసిన మహనీయుడన్నారు. బంజార సమాజం అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ సేవాలాల్‌ జయంతి వేడుకలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. అంతకు ముందు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద నుంచి పాఠశాల వరకు ర్యాలీ తీశారు. చిన్నారులు, యువతులు తీజ్‌ బుట్టలతో వచ్చా రు. సభా స్థలంలో సాంప్రదాయ పద్ధతిలో భోగ్‌ బండా ర్‌ పూజలు చేశారు. మంచిర్యాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ గౌడ్‌, డీటీడబ్ల్యూవో సంజీవ రావు, శ్రీసంత్‌ సద్గురు సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు బదావత్‌ ప్రకాశ్‌, బుక్య రవినాయక్‌, లోక య్య, మల్లేశ్‌, రాజూ నాయక్‌, పంతుల్యా, చంద్రు నా యక్‌, రఘునాథ్‌, లంబాడీ కులస్తులు పాల్గొన్నారు.


logo