సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Feb 19, 2020 , 23:26:19

‘మిస్టర్‌ ఆదిలాబాద్‌'గా సదానందం

‘మిస్టర్‌ ఆదిలాబాద్‌'గా సదానందం

బెల్లంపల్లి టౌన్‌: మిస్టర్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌గా హన్మాన్‌బస్తీ, స్కై జిమ్‌కు చెం దిన పన్నాల సదానందం గెలుపొందా డు. సీసీసీ నస్పూర్‌లో మంగళవారం రాత్రి జరిగిన పోటీల్లో సదానందం ప్రతి భ చూపి విజయం సాధించాడు. డీ ప్రశాంత్‌ కుమార్‌ (75 కేజీలు-ప్రథమ), బీ గణేశ్‌ (70 కేజీలు-ద్వితీయ), కే సృజ న్‌ (85 కేజీలు-తృతీయ), ఎస్‌ ప్రకాశ్‌ (75 కేజీలు- చతుర్థ) యండీ రాహీల్‌ (65 కేజీలు), ఎన్‌ రాకేశ్‌ (75 కేజీలు-పంచమ) స్థానాలను కైవసం చేసుకున్నారు. విజేతలకు సీసీసీ నస్పూర్‌ ము న్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి  బహుమతులు అం దజేశారు. 


గెలుపొందిన క్రీడాకారులను పవర్‌లిఫ్టింగ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెట్టి మురహరిరావు, జిల్లా క్యారమ్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి తనుగుల రాజ న్న, స్కై జిమ్‌ నిర్వాహకులు బాలకృష్ణ, శేఖర్‌ అభినందించారు. ప్రతిభ చూపిన టేకులబస్తీకి చెందిన దేవసాని ప్రశాంత్‌కుమార్‌ను వార్డు కౌన్సిలర్‌ రామగిరి రామకృష్ణ ఆ ధ్వర్యంలో శాలువా జ్ఞాపికతో సత్కరించారు. 75 కిలోల విభాగంలో ప్రథమ బ హుమతి సాధించినందుకు బస్తీ యూత్‌ నాయకులు అభినందించారు. బస్తీ యూ త్‌ కమిటీ నాయకులు ముచ్చకుర్తి రంజి త్‌ కుమార్‌, చింతల లోకేశ్‌, శ్యామ్‌రాజ్‌, నాగరాజు, రాణా ప్రతాప్‌, వంశీ, మౌని క్‌, మహేశ్‌ పాల్గొన్నారు. 

logo