మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Feb 19, 2020 , 23:25:14

ఇంటర్‌ పరీక్షలు సజావుగా జరగాలి

ఇంటర్‌ పరీక్షలు సజావుగా జరగాలి

మంచిర్యాల రూరల్‌: ఇంటర్‌ పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని అస్టిటెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలసి సంబంధిత శా ఖల అధికారులతో బుధవారం మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ మార్చి 4 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే పరీక్షల కోసం జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మార్చి 4, 6, 10, 12, 14, 17, 19, 21 తేదీలలో, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు  5, 7, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో పరీక్షలు ఉంటాయన్నారు. 


మొదటి రోజు నుంచి ముగిసేంత వరకు అన్ని కేంద్రాల 144 సెక్షన్‌ విధించి, బందోబస్తు చేపట్టాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉండే జీరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అం దుబాటులో ఉంచాలన్నారు. తాగు నీరు, వి ద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం పరీక్ష సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి భీష్మ, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారిణి ఇంద్రాణితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo