శనివారం 31 అక్టోబర్ 2020
Mancherial - Feb 19, 2020 , 02:35:15

ఉత్పత్తిలో రక్షణ చర్యలు కీలకం..

ఉత్పత్తిలో రక్షణ చర్యలు కీలకం..

బొగ్గు ఉత్పత్తికి రక్షణే ప్రధాన సూత్రమని ఏరియా జీఎం రమేశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సింగరేణి పాఠశాల పక్కన నిర్మించిన సేఫ్టీ మేనేజ్‌మెంటు ట్రెయినింగ్‌ సెంటర్‌ భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

  • జీఎం రమేశ్‌రావు
  • మందమర్రిలో అతి పెద్ద ఎస్‌ఎంటీసీ ప్రారంభం
  • హైదరాబాద్‌ నుంచి రిమోట్‌తో స్విచ్‌ ఆన్‌ చేసిన డీజీఎంఎస్‌ సుబ్రహ్మణియన్‌

మందమర్రి రూరల్‌ : బొగ్గు ఉత్పత్తికి రక్షణే ప్రధాన సూత్రమని ఏరియా జీఎం రమేశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సింగరేణి పాఠశాల పక్కన నిర్మించిన సేఫ్టీ మేనేజ్‌మెంటు ట్రెయినింగ్‌ సెంటర్‌ భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ భవనాన్ని సింగరేణి చరిత్రలో ఎన్నాడూ లేని విధంగా హైదరాబాద్‌ నుంచి డీజీఎంఎస్‌ ఆర్‌.సుబ్రహ్మణ్యం రిమోట్‌ ఆపరేషన్‌ ద్వారా ప్రారంభించడం విశేషం. అనంతరం జీఎం రమేశ్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యాయలంలోని కాన్ఫరెన్స్‌ హాలు, పలు సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గనుల్లో, డిపార్ట్‌మెంట్‌లో ప్రమాదాలను అరికట్టేందుకు సింగరేణి యాజమాన్యం ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా గనులలోని కార్మికులకు, ఉద్యోగులకు రక్షణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముందుగా 25 మంది సింగరేణి అధికార బృందానికి ఆస్ట్రేలియా దేశంలోని సింటార్స్‌ సంస్థ రక్షణ చర్యలపై ప్రత్యేక శిక్షణనిస్తుందనీ, అందులో ఎంపికైన 10 మంది అధికార బృందం ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల్లో తీసుకుంటున్న రక్షణ అంశాలపై అధ్యయనం చేస్తారని తెలిపారు.


అక్కడి టెక్నాలజీని ఉపయోగించుకొని సింగరేణిలో పూర్తి స్థాయి రక్షణ కల్పించేందుకు ఎస్‌ఎంటీసీ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి గనిలోని 25 మందికి రక్షణపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఆండ్‌ ఫైర్‌ డిపార్టుమెంట్‌ వారి సర్టిఫికెట్‌తో అన్ని ఆధునికరమైన పరికరాలు, సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆస్ట్రేలియా వారి అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్‌ క్లాస్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ రూమ్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. సింగరేణిలో ఇప్పటివరకు రామగుండం రీజియన్‌లో ఎస్‌ఎంటీసీ సెంటర్‌ ఉండగా, అంత కంటే పెద్ద ఎత్తున సూమారు రూ. 3 కోట్లతో సింగరేణి పాఠశాల పాత భవనాన్ని ఆధునీకరించి యంత్ర సామగ్రిని సమకూర్చామని తెలిపారు. రక్షణ విషయంలో నూతన ఓరవడిని తీసుకురావడానికి ఈ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎంతటి రిస్క్‌నైనా ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఇలాంటి సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేసిన సింగరేణి సీఆండ్‌ఎం శ్రీధర్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం వెంకటేశ్వర్లు, పీఎం మురళీధర్‌రావు, డీప్యూటీ పీఎంలు శ్యామ్‌ సందర్‌, రెడ్డిమల్ల తిరుపతి, ఎస్‌ఎంటీఎస్‌ అధికారులు రాందాస్‌, విజయ్‌కుమార్‌, టీబీజీకెఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు ఎం. సంపత్‌, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ టీబీజీకేఎస్‌ కేంద్ర కమిటీ నాయకులు బడికెల సంపత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.