మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Feb 17, 2020 , 23:56:58

అదనపు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

అదనపు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

మంచిర్యాల రూరల్‌ : జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమితులైన ఐలా త్రిపాఠి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ భారతి హోళికేరిని కలిశారు. అదనపు కలెక్టర్‌కు కేటాయించిన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అదనపు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలకు అందేలా కృషి చేస్తానని  అదనపు కలెక్టర్‌ తెలిపారు. 


logo