శుక్రవారం 05 జూన్ 2020
Mancherial - Feb 17, 2020 , 03:07:34

బృహత్తర పథకం.. కల్యాణలక్ష్మి

బృహత్తర పథకం.. కల్యాణలక్ష్మి

మంచిర్యాల టౌన్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు బృహత్తరమైనవని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణం మున్సిపల్‌ ప్రాంగణంలో 142 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 18 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున, బీసీ లబ్ధిదారుల్లో ఒకరికి రూ.51వేలు, ఇద్దరికి రూ.75,116, 121 మందికి ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.1.41కోట్ల విలువైన చెక్కులు అందించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరుస ఎన్నికల కోడ్‌ మూలంగా చెక్కుల పంపిణీలో ఆలస్యమైందన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదలను ఆదుకోవాలన్న ఆలోచనతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం అందిస్తున్నదని అన్నారు. ఇటువంటి పథకం భారతదేశంలో ఎక్కడా లేదని, ఈ పథకాల ద్వారా లక్షలాది మంది నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజ లు దీవించాలని, సమయం వచ్చినపుడు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముకేష్‌ గౌడ్‌, తాసిల్దార్‌ రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. 


logo