మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Feb 16, 2020 , 02:58:20

వంద శాతం పన్నులు వసూలు చేయాలి

వంద శాతం పన్నులు వసూలు చేయాలి

మంచిర్యాల రూరల్‌ : గ్రామాల్లో వంద శా తం పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో మండల పంచాయితీ అధికారులతో డీపీఓ కార్యాలయంలో, పంచాయితీ కార్యదర్శులు,కారోబార్లతో హాజీపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీల్లో వందశా తం పన్నులు వసూలు చేయాలని సూచించా రు. పన్నుల వసూళ్లలో జిల్లాను రాష్ట్రంలో ముందుంచాలని తెలిపారు. పల్లెప్రగతిలో భాగంగా ప్రతి నిత్యం గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో వై కుంఠధామాలు(శ్మశనవాటిక)ను ఏర్పాటు చేయడం, డంపింగ్‌ యార్డులు,ఇంకుండు గుం తల నిర్మాణాలు చేపట్టాలన్నారు. పల్లె ప్రగతి పనుల్లో ఎవరు అలసత్వం చేయవద్దనీ, విధుల పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్యాలయ పరిపాలనాధికారి సాధిక అలీ, మండల పంచాయితీ అధికారులు శంకర్‌,రవీంద్రనాథ్‌, వివేక్‌రామ్‌, సతీష్‌, శ్రీపతి బాపురావు, రమేశ్‌, అనిల్‌, బీరయ్య, సతీష్‌ రెడ్డి, ఎంపీడీఓ ఎంఏ హై, పంచాయితీ కార్యదర్శులు, పాల్గొన్నారు. 


డీపీఓకు వినతి..

తెలంగాణ గ్రామ పంచాయితీ కార్యదర్శుల ఫోరమ్‌ ఆధ్వర్వంలో శనివారం హాజీపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో డీపీఓకు వినతి పత్రం అందజేశారు. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పనులను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించ వద్దని కోరా రు. పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్‌, సత్యనారాయణ, సుమన్‌, మాధవ్‌, చంద్రకళ, మల్లే శ్‌, శ్రావణ్‌, హరిత, ప్రతిభ తదితరులున్నారు


logo