శుక్రవారం 05 జూన్ 2020
Mancherial - Feb 16, 2020 , 02:54:24

రెండు రోజుల్లో వార్డు కమిటీలు వేయాలి

రెండు రోజుల్లో వార్డు కమిటీలు వేయాలి

మంచిర్యాల రూరల్‌ : నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ పరిధిలోని ప్రతి వార్డులో రెండు రోజుల్లోగా కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో అసిస్టెంట్‌ ట్రయినీ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి మున్సిపల్‌ కమిషనర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రతి వార్డులో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఒప్పంద కార్మికులు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైతే వారిని విధుల నుంచి తొలగించాలనీ, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం(శ్మశన వాటిక)ల ఏర్పాటు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో కమ్యూనిటీ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజల్లో వీటన్నింటిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలనీ, వార్డుల వారీగా మున్సిపల్‌ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని దాని ప్రకారం పనులు చేపట్టాలని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.logo