బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Feb 14, 2020 , 23:50:41

పుల్వామా అమర జవాన్లకు నివాళి

పుల్వామా అమర జవాన్లకు నివాళి

బెల్లంపల్లి టౌన్‌ : పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులన జవాన్లకు జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నివాళులు అర్పించారు. ఐ స్టాండ్‌ ఫర్‌ ద నేషన్‌ పిలుపు మేరకు పట్టణంలోని తిలక్‌స్టేడియం నుంచి ఏఎంసీ మైదానం 125 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ తీశారు. అనంతరం ఏఎంసీ మైదానంలో మౌనం పాటించారు. జాతీయ గీతంతో అమర జవానులకు గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీశ్‌, ఉపాధ్యక్షుడు లింగాల జలపతి, సభ్యులు, సామాజిక కార్యకర్త నాదీర్షా నక్వీ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, భవిత డిగ్రీ కళాశాల విద్యార్థులు, వివిధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు. మాతృహృదయం స్వచ్ఛంద సేవా  సంస్థ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో  సంస్థ అధ్యక్షుడు మచ్చకుర్తి రంజిత్‌ కుమార్‌, సభ్యులు పాల్గొన్నారు. 

భీమిని(కన్నెపల్లి) : పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు కన్నెపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. భీమిని మం డలం మామిడిగూడ పాఠశాలలో విద్యార్థులు మౌనం పా టించారు. కార్యక్రమంలో  హెచ్‌ఎం సంజీవ్‌, మాలీ సం ఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు రాజ న్న, శ్రీనివాస్‌, విజయ్‌, గోపాల్‌,విద్యార్థులు పాల్గొన్నారు.  

పాఠశాలల్లో..

కాసిపేట : దేవాపూర్‌ జిల్లాపరిషత్‌ సెకండరీ పాఠశాలలో యువశక్తి యూత్‌ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. జాతీయ గీతం ఆలపించారు.  లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు గొంది వెంకటరమణ, యువ శక్తి యూత్‌ అధ్యక్షుడు దండ వేని చందు, నాయకులు బింగి శ్రీనివాస్‌, కైలాస్‌,ఉపాధ్యాయులు,విద్యార్ధులు పాల్గొన్నారు.  మల్కెపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు నివాళులర్పించారు. సోమగూడెం భరత్‌ కాలనీ యువకులు, లంబడితాండ విద్యార్థులు, కాసిపేట పోలీసులు నివాళులర్పించారు. కార్యక్రమంలో యూత్‌ నాయకులు కృష్ణ, కిరణ్‌, కల్యాణం సురేశ్‌ పాల్గొన్నారు. 

వేమనపల్లి : మండలంలోని ముల్కలపేట ప్రాథమిక పాఠశాలలో నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో సర్పంచు రాజలింగు, కార్యదర్శి సురేశ్‌, మాజీ ఎంపీపీ లింగాగౌడ్‌,  ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు. 


logo