శనివారం 29 ఫిబ్రవరి 2020
విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

Feb 14, 2020 , 00:32:41
PRINT
విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

అయిజ : రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూధనాచారి అన్నారు. గురువారం అయిజ నుంచి గద్వాల రహదారిలో నూ తనంగా నిర్మించిన వీరబ్రహ్మేంద్ర శివరామాలయం లో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయనతో పాటు డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, జెడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమ్మేళనంలో మాజీ స్పీకర్‌ మాట్లాడుతూ విశ్వ బ్రా హ్మణ వృత్తిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయడంతోపాటు వృత్తి నైపుణ్యం పెం పొందించుకునేందుకు శిక్షణ ఇస్తుందన్నారు. గత నాలుగేళ్ల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేయాలని కోరడంతో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి దేవాదాయ, ధర్మాదాయ శాఖ ద్వారా రూ. 41 లక్షలు వి డుదల చేయించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులతోపాటు రూ.4 లక్షలు దాతలు సహకరించడం వల్లే ఆలయ నిర్మాణం సా ధ్యమైందని డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్ర తినిధి మంద జగన్నా థం అన్నారు. జిల్లాలో ఎక్కడలేని విధంగా వీ రబ్రహ్మేంద్ర శివ రామాలయాన్ని నిర్మించడం గర్వించదగ్గ విషయమని జెడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత అన్నారు. విశ్వ బ్రాహ్మణులు అడిగిన తక్షణమే సీడీపీ నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. అంతకుముందు నటరాజ నృత్య కళానికేతన్‌, కన్నాంబ టీచర్‌ ఆధ్వర్యంలో నృత్య ప్రదన్శన నిర్వహించారు. కార్యక్రమం లో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సం ఘం అధ్యక్షుడు వెంకటాచారి, జిల్లా అధ్యక్షుడు వినోదాచారి, ఆలయ కమిటీ మెంబర్‌ సర్వేశ్వరాచారి, విశ్వబ్రాహ్మణ సం ఘం నాయకులు పాల్గొన్నారు. 

భక్తి పరవశంతో పులకించిన అయిజ ..

గద్వాల రహదారిలో నూతనంగా నిర్మించిన మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర శివ రామాలయంలో విగ్రహాల ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన గాయత్రి మఠం పీఠాధిపతి శ్రీకాంతేదేంద్రస్వామి, బ్రహ్మంగారి మఠం ప్రధానాచార్యులు గోవింద స్వాముల ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, భక్తులు గణపతి విగ్రహంతోపాటు వీరబ్రహ్మేంద్రస్వామి, శివుడు, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, నవగ్రహ విగ్రహాలను ప్రతిష్టించారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణల నడుమ ప్రత్యేక క్రేన్‌ సహాయంతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. 


logo