ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Feb 14, 2020 , 00:23:38

యువశాస్త్రవేత్తలుగా ఎదగాలి..

యువశాస్త్రవేత్తలుగా ఎదగాలి..

మంచిర్యాల అగ్రికల్చర్‌ : జిల్లాలోని విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని, ఇస్రో గురించి తెలియాల్సిన అవసరం ఉందని, అవగాహన కల్పించేందుకే భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) గురించి ప్రతి మండలానికి చేరుకునేలా చేయడం కోసం ఈ బస్సు యాత్రను మొదలు పెట్టామని కలెక్టర్‌ భారతి పేర్కొన్నారు. బుధవా రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఇస్రో నుంచి వచ్చిన ‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌' బస్సు యాత్రను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. బస్సులో పరిశీలిస్తూ అంతరిక్షంలో జరిగే వాటిని విద్యార్థులకు వివరించారు. గ్రౌండ్‌లో రాకెట్‌ పైకి ఎలా ఎగురుతుందో ప్రాక్టికల్‌గా కలెక్టర్‌ పరిశీలించి అనంతరం విద్యార్థులతో చేయించి న్యూట న్‌ లా గురించి వివరించారు. రాకెట్‌ పైకి ఎలా ఎగుర గలుగుతుందో తెలిపారు. సైన్స్‌ను సబ్జెక్టులా చూడకుండా ప్రాక్టికల్‌గా గమనిస్తే అర్థమవుతుందని సూచించారు. ఈ బస్సు యాత్ర శనివారం వరకు జిల్లాలోని ప్రతి మండలంలో తిరిగి వస్తుందని, విద్యార్థులకు అంతరిక్ష పరిశోధన విజయాలను తెలియజేస్తుందన్నారు. యువిక కార్యక్రమం కిం ద రెండు వారాలపాటు సైన్స్‌లో విజ్ఞానపరంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అంతరిక్ష కేంద్రాలైన శ్రీహరికోట, ఇతరత్రా రాకెట్‌ కేంద్రాలలో విజ్ఞాన ప్రదర్శన చూపిస్తారని, అర్హత కలిగిన వారిని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు వరుస క్రమంలో బస్సులోకి వెళ్లి ప్రతీది నోట్‌ చేసుకున్నారు. 1500మంది విద్యా ర్థులు ప్రదర్శనలను తిలకించారు. అనుమానాలు ఉన్న వారికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇస్రో ఎన్‌ఆర్‌ఎస్‌ఈ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ రామయ్య వివరించారు. అలాగే విక్రమ్‌ సారాభాయ్‌ జీవన విధానం, ఇస్రో విజయగాథ, రాకెట్‌ నమూనా, శాటిలైట్‌ మోడల్స్‌, లాంచింగ్‌ ప్యాడ్‌లతోపాటు చంద్రయాన్‌, మంగళ్యాన్‌ వంటి రాకెట్‌లను 1947 నుంచి ఇప్పటివరకు పంపించడం జరిగిందన్నారు. విద్యార్థి దశ నుంచే సైన్స్‌ పరంగా అనేక విషయాలు తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇస్రో పరిశోధనల వివరాలతో కూడిన వాల్‌ పోస్టర్లను డీఈఓ, కలెక్టర్‌ ఆవిష్కరించారు. మధ్యాహ్నం ఈ బస్సు యా త్ర లక్షెట్టిపేట వైపు బయలుదేరి వెళ్లింది. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.logo