శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Feb 14, 2020 , 00:18:18

మేడారం జాతరలో ఎన్‌ఎస్‌ఎస్‌ సేవ

మేడారం జాతరలో ఎన్‌ఎస్‌ఎస్‌ సేవ

బెల్లంపల్లిటౌన్‌ :  బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు ఈ సారి మేడారం సమ్మక్క జాతరలో సేవ లందించారు. సెలవు దినాల్లో పల్లెల్లో సా మాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్న విద్యార్థులు సమ్మక్క-సార లమ్మ క్షేత్రంలో వివిధ రకాల సేవలు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు.  ఈ నెల 3 నుంచి 8 వరకు జరిగిన మేడారం సమ్మక్క జాతరలో కాకతీయ యూనివర్సి టీ పరిధిలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుం చి 10 మంది విద్యార్థు లు సేవలందించా రు. విద్యార్ధులను కళాశాల ప్రిన్సిపాల్‌ మేకల గోపాల్‌, లెక్చరర్లు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే విద్యార్థులు దసరా, సం క్రాంతి, వేసవి సెలవు రోజుల్లో కళాశాల చుట్టు పక్కల గ్రామాల్లో శ్రమదానం, అక్షరాస్యతపై గ్రామీణుల్లో అవగాహన పెంచడంతోపాటు, సమాజాభివృద్ధికి దోహదపడే అంశాలపై అవగాహన ర్యాలీలు తీ స్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.