శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Feb 14, 2020 , 00:15:25

అక్రమ లేఅవుట్లపై కొరడా !

అక్రమ లేఅవుట్లపై కొరడా !

మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ: మంచిర్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా వెలసిన లేఅవుట్లలో వేసిన రోడ్లను, హద్దు రాళ్లను గురువారం మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తొలగించారు. పట్టణంలో అక్రమంగా వెలసిన లేఅవుట్లలోని హద్దురాళ్లు, రోడ్లను మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి ఆదేశాల మేరకు టీపీబీఓ యశ్వంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రొక్లెయిన్‌ సాయంతో తొలగించారు. ఇందులో తోళ్లవాగు సమీపంలోని శ్రీశ్రీ నగర్‌లో గర్మిళ్ల శివారు 353, 354 సర్వేనెంబర్లలోని 8 ఎకరాలు, వైశ్యభవన్‌ ఏరియాలోని మంచిర్యాల శివారు 447, 448 సర్వేనెంబర్లలో ఐదెకరాలు, పాతగర్మిళ్ల సమీపంలో గర్మిళ్ల శివారు సర్వేనెంబర్‌ 40లో రెండెకరాల్లో వేసిన రోడ్లను తొలగించారు. అనుమతులు లేకుండా చేసిన ప్లాట్లను కొంటే ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు లభించవని చెప్పారు. ప్లాట్లను కొనుగోలు చేసేవారు కొనేముందు లేఅవుట్‌ అనుమతులు ఉన్నాయో లేదో చూసి తీసుకోవాలని టీపీబీఓ యశ్వంత్‌కుమార్‌ తెలిపారు. logo