గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Feb 13, 2020 , 01:33:28

40 రోజులు..9.7 లక్షల టన్నులు

40 రోజులు..9.7 లక్షల టన్నులు

శ్రీరాంపూర్‌ : 40 రోజుల్లో 9.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి, శ్రీరాంపూర్‌ ఏరియా ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్‌ ఏరియా డీవైజీఎం(ఏజెంట్లు) గనుల మేనేజర్లతో జీఎం ఉత్పత్తి సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ 2019-20 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్య సాధనకు అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అన్ని గనులు 100 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించేలా గనుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కోరారు. ఉత్పత్తి, రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు, కార్మికుల హాజరు శాతం పెంచాలనీ, గనుల్లో ఓసీపీలో యంత్రాల సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా యంత్రాలు బ్రేక్‌డౌన్‌ కాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీహెచ్‌పీకి బొగ్గు సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ముఖ్యంగా బొగ్గు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్లు చింతల శ్రీనివాస్‌, రాజేశ్వర్‌రెడ్డి ఎస్‌ఓటూజీఎం కుమారస్వామి, డీవైజీఎంలు గోవిందరాజు, రమేశ్‌, విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌, రాజశేఖర్‌రెడ్డి, రఘుకుమార్‌, అన్ని గనుల మేనేజర్లు పాల్గొన్నారు. 


logo