శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Feb 12, 2020 , 02:02:46

సహ‘కారు’ హుషారు

సహ‘కారు’ హుషారు

నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌) ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో 77 పీఏసీఎస్‌లు ఉండగా.. ఆదిలాబాద్‌లో 28 పీఏసీఎస్‌లు, నిర్మల్‌ జిల్లాలో 17పీఏసీఎస్‌లు, మంచిర్యాల జిల్లాలో 20 పీఏసీఎస్‌లు, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 12 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఒక్కో పీఏసీఎస్‌ పరిధిలో 13 టీసీలు ఉండగా.. ఆదిలాబాద్‌ జిల్లాలో నాలు గు పీఏసీఎస్‌లకు (జామిడి-ఏ, హస్నాపూర్‌, మా న్కాపూర్‌, చాందా-టి), మంచిర్యాల జిల్లాలో రెండు పీఏసీఎస్‌లకు (ఇటిక్యాల, గుల్లకోట) 12 టీసీల చొప్పున ఉన్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 995 టీసీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఇందుకోసం ఈ నెల 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 10న నామినేషన్ల ఉపసంహరణ ఉండగా.. పెద్ద ఎత్తున టీసీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 995 టీసీలకు.. 607 టీసీలు ఏకగ్రీవమయ్యాయి. మంచిర్యాల జిల్లా నెల్కివెంకటాపూర్‌ పీఏసీఎస్‌లోని టీసీ-4లో ఇద్దరు నామినేషన్లు వేయగా.. రెండు కూడా తిరస్కరించారు. దీంతో ఇక్కడ ఎవ రూ పోటీలో లేకుండా పోయారు. ఈ నెల 15న ఉ మ్మడి జిల్లాలో 387 టీసీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

క్లీన్‌స్వీప్‌ దిశగా అడుగులు

ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీమైన టీసీలతోపాటు పీఏసీఎస్‌లలో టీఆర్‌ఎస్‌దే ఆధిపత్యం ఉంది. 95 శాతానికిపైగా డైరెక్టర్లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకోగా.. పూర్తిగా ఏకగ్రీవమైన పీఏసీఎస్‌లు పూర్తిగా కారు ఖాతాలోనే పడ్డాయి. నిర్మల్‌ జిల్లాలో 221 టీసీలకు 99, మంచిర్యాల జిల్లాలో 258 టీసీలకు 168 టీసీలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 360 టీసీలకు 227 టీసీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 156 టీసీలకు..113 టీసీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 95 శాతానికిపై టీసీలు గులాబీ మద్దతుదారులే దక్కించుకున్నారు. ఇదిలా ఉండ గా 22 పీఏసీఎస్‌లలో పూర్తిగా టీసీలు(13) ఏకగ్రీవం కాగా వీటిని టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. నిర్మల్‌ జిల్లాలో 1, మంచిర్యాల జిల్లాలో 7, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 3, ఆదిలాబాద్‌ జిల్లాలో 11 పీఏసీఎస్‌లున్నాయి. మరో 26 సం ఘాల్లో మెజారిటీ టీసీలు ఏకగ్రీవమవగా.. ఇవి కూడా కారు ఖాతాలో పడనున్నాయి. నిర్మల్‌ జిల్లాలో 7, మంచిర్యాల జిల్లాలో 4, ఆదిలాబాద్‌ జిల్లాలో 7, ఆసిఫాబాద్‌ జిల్లాలో 8 పీఏసీఎస్‌ల్లో మెజారిటీ టీసీలు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకే దక్కాయి. మొత్తానికి 77 పీఏసీఎస్‌లలో 48 పీఏసీఎస్‌లు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నట్లే. మరికొన్ని చోట్ల 5 లోపు టీసీలు ఏకగ్రీవం కాగా ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఎక్కువగా ఉన్నా రు. ఈ నెల 15న జరిగే పోలింగ్‌ తర్వాత అన్ని పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ దక్కించుకుని క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా అడుగులు వేస్తోంది.

మెజారిటీ టీసీలు కారువే..

నిర్మల్‌ జిల్లాలో లక్ష్మణచాందా, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట, ఇటిక్యాల, దండేపల్లి మండలం గూడెం, మందమర్రి, జైపూర్‌, తాండూర్‌, వేమనపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి, తిర్యాణి, కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లా లాండసాంగ్వి, తాంసి, జామిడి-ఏ, హస్నాపూర్‌, గూడరాంపూర్‌, జామిడి-బి, ముక్రా, మాన్కాపూర్‌, నర్సాపూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి పీఏసీఎస్‌లలో అన్ని టీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ 22 పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. నిర్మల్‌ జిల్లా మామడ, సత్తెనపల్లి, ఖానాపూర్‌, ముఠాపూర్‌, కౌట్ల(బి), ఆలూరు, మంజులాపూర్‌, ఆదిలాబాద్‌ జిల్లా దోప్తాలా, ఆదిలాబాద్‌, తలమడుగు, నేరడిగొండ, కుమారి, బజార్‌హత్నూర్‌, ఉట్నూర్‌ పీఏసీఎస్‌లలో ఏకగ్రీవమైన వాటిలో ఎక్కువ స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆసిఫాబాద్‌, వాంకిడి, రెబ్బెన, జైనూర్‌, సిర్పూర్‌(యు), సిర్పూర్‌(టి), దహేగాం, కౌటాల, మంచిర్యాల జిల్లా నెన్నెల, చెన్నూర్‌, కోటపల్లి, జెండా వెంకటాపూర్‌ పీఏసీఎస్‌లలో మెజారిటీ టీసీలు టీఆర్‌ఎస్‌కు చెం దిన వారే ఉండడంతో ఇవి కూడా కారు ఖాతాలో పడనున్నాయి.


logo