మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Feb 12, 2020 , 02:00:21

మొక్కల పెంపకం వేగవంతం..

మొక్కల పెంపకం వేగవంతం..

నెన్నెల : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో హరితహారం నర్సరీలను ఏర్పాటు చేశారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో గ్రామానికి 40 వేల మొక్కల పెంపకం చేపడుతున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి అందులో కూలీలచే మొక్కల పెంపకం చేపడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో నర్పరీలను ఏర్పాటు చేసి బ్యాగుల్లో ఆయా మొక్కల వితనాలను సైతం నాటారు. పలు నర్సల్లో మొక్కలు ఎదుగుతున్నాయి. గతేడాది పెంచిన మొక్కలలో కొన్ని మిగిలి ఉండగా అదనంగా మొక్కలను ప్రజల అవరాలకు ఉపయోగ పడే మొక్కలను పెంచుతున్నారు.  టేకు, పూ ల మొక్కలు, రోడ్డుకు ఇరువైపుల నాటేందు కు ఉపయోగపడేవి, గృహవసరాలకు వినియోగించే పండ్లమొక్కలు నర్పరీలలో ఏర్పాటు చేస్తున్నారు. 

నర్సరీల పరిశీలన

కాసిపేట : మండలంలోని మల్కెపల్లి నర్సరీని పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌ చొప్పదండి తిరుపతి పరిశీలించారు. ఈ సందర్భం గా గ్రామ పంచాయతీలో చేపడుతున్న పనులతో పాటు నర్సరీలోని మొక్కలను, గ్రామా ల్లో నాటిన మొక్కల సంరక్షణను పరిశీలించారు. పల్లంగూడ నర్సరీని పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ పరిశీలించారు. మొక్కల సంరక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్‌ దుస్స విజయ, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo