మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Feb 10, 2020 , 23:34:18

టీఆర్‌ఎస్‌ ఖాతాలో 174

టీఆర్‌ఎస్‌ ఖాతాలో 174

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార సంఘ చైర్మన్లుగా తమ మద్దతుదారులు గెలిచేలా టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఏకగ్రీవ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో సైతం తమదే గెలుపు సాగేలా ప్రణాళికలు రూపొందించింది. జిల్లావ్యాప్తంగా ఆరు ఏకగ్రీవం అయ్యాయి. ఇక మిగతా వాటిల్లో కూడా మెజారిటీ డైరెక్టర్లు టీఆర్‌ఎస్‌ వారే విజయం సాధించారు. దీంతో ఈ ఎన్నికల్లో కూడా కారు భారీ విజయం సాధించే దిశగా దూసుకుపోతోంది. మొదటి ఎన్నికల్లో తన హవా కొనసాగిస్తున్న ఇంటి పార్టీ వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు నేరుగా సంబంధాలు ఉండే ఈ సహకార ఎన్నికల్లో సైతం రైతులు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేసేందుకు సిద్ధం అయ్యారు. దీనిని గమనించిన మిగతా పార్టీల అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు చాలా మంది పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక సోమవారం నామినేషన్లు సైతం పెద్ద ఎత్తున ఉపసంహరించుకున్నారు.

ఆరింటిలో ఏకగ్రీవం..

జిల్లాలో ఉన్న ఆరు సహకార సొసైటీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో గూడెం, గుల్లకోట, ఇటిక్యాల, జైపూర్‌, వేమనపల్లి, మందమర్రిలో 13 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దాదాపు అ న్నింటిలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే వీటిని కైవ సం చేసుకున్నారు. చెన్నూరు సహకార సంఘం లో 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక్కడ ఉన్న ఒక్క వార్డులో ఇద్దరు పోటీ పడుతున్నారు. తాండూరు, కోటపల్లి పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కోటపల్లిలో సైతం 12 వార్డు లు ఏకగ్రీవం అయ్యాయి. ఇక జైపూర్‌ సహకార సంఘానికి సంబంధించి 13 స్థానాలు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం చేసింది. మిగతా చోట్ల కూడా చాలా మంది టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే గెలుపొందడంతో దాదాపు అన్నింటిలో టీఆర్‌ఎస్‌ పాగా వేయనుంది. 

బరిలో 367మంది సభ్యులు..

జిల్లాలో 20 సహకార సొసైటీలు ఉండగా, 672 నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం పరిశీలనలో 69 నామినేషన్లు తిరస్కరించారు. 603 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారు లు వెల్లడించారు. సోమవారం నామినేషన్లు ఉపసంహరణ కార్యక్రమం నిర్వహించగా, అందులో 236మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 258 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అందులో సోమవారం నాటికి 174 స్థానాలు ఏకగ్రీవం అయ్యా యి. చాలాచోట్ల ద్విముఖ పోటీనే ఉండడం గమనార్హం. అవన్నీ కూడా టీఆర్‌ఎస్‌ గెలిచేందుకు ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. నెల్కి వెంకటాపూర్‌ సహకార సంఘం లోని రెబ్బన్‌పల్లి డైరెక్టర్‌ స్థానానికి దాఖలైన రెండు నామినేషన్లు తిరస్కరించారు. దీంతో ఆ స్థానానికి ఎన్నికలు లేవు.


logo