శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Feb 10, 2020 , 23:32:01

సోలార్‌ పవర్‌ సక్సెస్‌

సోలార్‌ పవర్‌ సక్సెస్‌

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ :   సింగరేణి కాలరీస్‌ కంపెనీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో నిర్మించిన మరో ఐదు మెగావాట్ల సోలార్‌ ప్లాంటు నుంచి విద్యుత్‌ ఉత్పాదన సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో సోలార్‌ ప్లాంటు విద్యుత్‌ను శ్రీరాంపూర్‌ ఏరియా 33కేవీ లైన్‌కు అనుసంధానం చేశారు. దీంతో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో నిర్మించిన మొత్తం 10 మెగావాట్ల ప్లాం టు పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పాదన ప్రారంభించినైట్లెంది. గత నెల 10 న మొదటి ఐదు మెగావాట్ల ప్లాంటు సోలా ర్‌ విద్యుత్‌ను ప్రారంభించారు.  దీన్నీ 33కేవీ లైను గ్రిడ్‌కు అనుసంధానించా రు. మిగిలిన ఐదు మెగావాట్ల ప్లాంటుకు సంబంధించిన పనులు  కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించడం గమనార్హం. సీఎండీ శ్రీధర్‌ ఆదేశంపై డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) ఎస్‌ శంకర్‌ 10 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి  కేంద్రం నిర్మాణ పనులను పలుమార్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిం చి నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.

ఇప్పటికే 5 లక్షల యూనిటు ్లగనులకు సరఫరా

     మొత్తం 10 మెగావాట్ల ప్లాంటులో ముందుగా నిర్మాణం పూర్తయిన ఐదు మెగావాట్ల ప్లాంటు నుంచి సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన గత నెల 10 న ప్రారంభం కాగా నెలలోనే ఐదు లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఈ ప్లాంటు ఉత్పత్తి చేసింది. దీన్ని అనుసంధానించిన 33 కేవీ లైను ద్వారా శ్రీరాంపూర్‌ ఏరియాలోని అన్ని భూగర్భగనుల్లో వాడకం కోసం సరఫరా చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు సింక్రనైజేషన్‌ జరిగిన మరో ఐదు మెగావాట్ల ప్లాంటు విద్యుత్‌ను  కూడా అనుసంధానించిన 33 కేవీ లైను ద్వారా శ్రీరాంపూర్‌ ఏరియా గనులకే సరఫరా చేస్తున్నామని తెలిపారు. 

సీఎండీ శ్రీధర్‌ అభినందనలు...

ఎస్టీపీపీలో నిర్మించిన పది మెగావాట్ల సోలార్‌ ప్లాంటు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభించి, గ్రిడ్‌కు అనుసంధానించడంపై సీఎండీ శ్రీధర్‌ హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా మణుగూరు, ఇల్లందు, రామగుండం- 3లోని ప్లాంటుల నిర్మాణాలు  కూడా వేగవంతంగా పూర్తవుతున్నాయనీ, త్వరలోనే విద్యుత్‌ ఉత్పాదన ప్రారంభిస్తాయన్నారు. ఆగస్టు నాటికి 220 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదనకు పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెండో ఐదు మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ సింక్రనైజేషన్‌ కార్యక్రమంలో సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఇన్‌చార్జి జీఎం మదన్‌ మోహన్‌, తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి ఎస్‌ఈ ట్రాన్స్‌కో (మంచిర్యాల) సుధర్‌, ఎస్‌ఈ (ఎన్‌పీడీసీఎల్‌) రమేశ్‌బాబు, చీఫ్‌ కో ఆర్డినేటర్‌ (సింగరేణి సోలార్‌ పవర్‌) మురళీధరన్‌, డీజీఎం(సింగరేణి సోలార్‌ ప్లాంటు) శ్రీనివాసరావు, నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ (ఏజీఎం) సుభా శ్‌, పర్సనల్‌ మేనేజర్‌ అరవింద్‌  రావు తదితరులున్నారు.


logo