మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Feb 10, 2020 , 23:31:23

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

భీమిని(కన్నెపల్లి): భీమిని మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఎంపీపీ పో తురాజుల రాజేశ్వరి అధ్యక్షతన సాదాసీదా గా సాగింది. మిషన్‌ కాకతీయ, ప్రాథమిక ఆయుర్వేదం, ఎక్సైజ్‌, రోడ్డు రవాణా, సాంఘీక సంక్షేమ, మత్య్స శాఖ అధికారు లు హాజరుకాలేదు. ఎంపీపీ రాజేశ్వరి మా ట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, గ్రామాల్లో చేపట్టిన పనుల వివరాలను అధికారులు ఇవ్వడం లేదనీ, ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యవసాయ, విద్య, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలు, ఉపాధి, అటవీ, కస్తూర్బా పాఠశాల, రెవె న్యూ శాఖ అధికారులు నివేదికలను చదివి వినిపించారు. విద్యుత్‌ ఏఈ రామ్‌మనోహర్‌ నివేదికలను చదివి వినిపించగా స ర్పంచ్‌ ఎల్లాగౌడ్‌ బిట్టూరుపల్లిలో రోడ్డుపై  ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను  మరో చోటికి మార్చాలని కోరినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మల్లీడిలో పంచాయతీ కార్యాలయానికి రూ. లక్ష క రెంట్‌ బిల్లు వచ్చిందని సర్పంచ్‌ బల్గం సం తోష్‌ ఏఈ రామ్‌మనోహర్‌ను ప్రశ్నించా రు. విద్యుత్‌ అధికారులు గ్రామాల్లో పర్యటించి బిల్లులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయని పర్యవేక్షించాలన్నారు. దుబ్బగూడెం లో విద్యుత్‌ చౌర్యం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చిన్న తిమ్మాపూర్‌లో విద్యుత్‌ సమస్య ఉందని సర్పంచ్‌ ఇందూరి భూమయ్య తెలిపారు. సీడీపీవో ఉమాదేవి నివేదిక చదివి వినిపించగా జడ్పీటీసీ గంగక్క మాట్లాడుతూ అం గన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ లేదనీ, కే స్లాపూర్‌లోని కేంద్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం లేదన్నా రు. వడాలలోని కేంద్రంలో  పిల్లలు లేకుండానే రిజిస్టర్‌లో హాజరు వేస్తున్నారని మం డిపడ్డారు. ఐకేపీ ఎపీఏం అశోక్‌ మాట్లాడగా ఎంపీపీ రాజేశ్వరి కల్పించుకుని ఖర్జీభీంపూర్‌లో ఒక్క మరుగుదొడ్డిని కూడా నిర్మించకుండానే రూ. 4 లక్షలు సామగ్రి కోసం  ఖాతా నుంచి తీయడం ఏంటని ప్ర శ్నించారు. ఖర్జీభీంపూర్‌లో మరుగుదొడ్లపై విచారణ జరిపి మంజూరైనవి ఎన్ని, బిల్లు లు ఎన్ని తీసారని తమకు చూపించాలన్నా రు. పల్లె ప్రగతి పనులను  కార్యక్రమం ఉ న్నంత వరకే నిర్వహించారనీ, నిరంతరం కొనసాగించాలనీ, డంపింగ్‌ యార్డులు, శ్మ శాన వాటిక నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎంపీపీ సూచించారు. వైస్‌ ఎం పీపీ చిలుముల మధు, ఎంపీటీసీలు కర్నె మమత, సంతోష్‌, సర్పంచులు బల్గం సం తోష్‌, గడ్డం ఎల్లాగౌడ్‌, వెంకన్న, కవిత, సవిత, ఎంపీడీవో రాధాకృష్ణ, సూపరింటెండెంట్‌ శంకర్‌, ఏపీవో భాస్కర్‌రావు, ఎంపీవో ప్రసాద్‌, ఆర్‌ఐ పెద్ది రాజు, పశువైద్యాధికారి సందీప్‌, ఎంఈవో మహేశ్వర్‌ రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ లలిత, ఆర్‌డబ్య్లూస్‌ ఏఈ పోచన్న, సీడీపీవో ఉమాదేవి, కార్యదర్శులు పాల్గొన్నారు. 


logo