గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Feb 10, 2020 , 23:30:45

సహకారంలో టీఆర్‌ఎస్‌ సత్తా

సహకారంలో టీఆర్‌ఎస్‌ సత్తా

నెన్నెల: సహకార పరపతి సంఘాల ఎన్ని కల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవాల్లో  అధిక్యం సాధించింది. బెల్లంపల్లి నియోజకవ ర్గం వ్యాప్తంగా మూడు  సంఘాలను ఏకగ్రీ వంతో కైవసం చేసుకుంది. బెల్లంపల్లి నియో జకవర్గంలోని అరు వ్యవసాయ పరపతి సం ఘాల్లో 78 డైరెక్టర్‌ స్థానాలుండగా  నామినే షన్లు ఉపసంహరణతో ఏకంగా 43   స్థానా లు ఏకగ్రీవం కాగా ఇందులో 32 టీఆ ర్‌ఎస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు. నెన్నెల, వేమనపల్లి, తాండూర్‌ సంఘాలలో మూడిం టిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవు లను కైవశం చేసుకుంది. తాండూర్‌లోని సం ఘంలో 13 ఏకగ్రీవం కాగా 7 డైరెక్టర్‌ స్థానాలను టీఆర్‌ ఎస్‌ ఏకగ్రీవం చేసుకొని చైర్మన్‌ పీఠాన్ని చే జిక్కించుకుంది. నెన్నెలలో 12 స్థానాలు ఏక గ్రీవం కాగా 7 టీఆర్‌ఎస్‌, 3 కాంగ్రెస్‌, 2 బీజేపీ ఎన్నిక కానుంది. ఇక్కడ చైర్మ న్‌ వైస్‌ చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ చేపట్ట పోతుంది. వేమనపల్లిలో 13 స్థానాలు ఏకంగా టీఆర్‌ ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకొని పీఠాన్ని కైవ సం చేసుకుంది. భీమిని సహకార సం ఘం లో 2 స్థానాలు ఏకగ్రీవం కాగా 2 టీఆర్‌ ఎస్‌ ఖాతాలో చేరాయి. 11 స్థానాల్లో 22 మంది బరిలో ఉన్నారు. బెల్లంపల్లిలోని చంద్రవెల్లి సంఘంలో ఒక స్థానం టీఆర్‌ఎస్‌ ఏకగీవ్రం చేసుకుంది. 12 స్థానాల్లో 31 మంది పోటీ లో ఉన్నారు. కాసిపేటలోని ధర్మా రావుపేట సంఘంలో 2 స్థానాలు ఏకగ్రీవం కాగా 2 టీ ఆర్‌ఎస్‌ గెలుచుకుంది. 11 స్థానాల్లో 26 మంది భరిలో ఉన్నారు. ఇటీవల జ రిగిన మున్నిపల్‌ ఎన్నికల్లో  ఎదురులేకుండా విజ యం సాధించిన ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య ఈ సహకార ఎన్నికల్లో ను ఏకగీవ్రాలతోనే ఆదిలోనే విజయం సాధిచారని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు వాపోతున్నారు. నియోజ కవర్గంలో ఎన్నికలు జరగనున్న సంఘాలలోను  పూర్తి స్థాయిలో డైరెక్టర్‌ స్థానాలను గెలుచుకుని అన్ని సంఘాలలో టీఆర్‌ఎస్‌ జండాను ఎగురవేస్తామంటున్నారు. రైతు లు కూడా తమకు టీఆర్‌ఎస్‌ పార్టీ వెన్నంటి ఉందని ఎన్నిక ఏదైన దానికే ఓటు వేస్తామంటున్నారు. 


logo