బుధవారం 03 జూన్ 2020
Mancherial - Feb 10, 2020 , 01:53:08

ఇంకుడుగుంతల నిర్మాణం వేగవంతం

ఇంకుడుగుంతల నిర్మాణం వేగవంతం

నెన్నెల: ఇంకుడుగుంతల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో అధికారులు గుంతల నిర్మాణం చేపట్టేందుకు నిత్యం ప్రజలను చైత న్య పరుస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి తప్పని సరిగా నిర్మించుకోవాలని సర్పంచులు, కార్యదర్శులు అవగాహన కల్పిస్తూ పనులు చేపడుతున్నారు. ఒక్కో గుంతకు ఈజీఎస్‌ ద్వా రా రూ.4 వేలు అందిస్తుండడంతో ఇందుకోసం ఇంటి యాజమానులు ముందుకొస్తున్నారు. మండల వ్యాప్తంగా 5వేలకుపైగా గుంతలు మంజూరయ్యాయి. ఇప్పటికే దా దాపు 20 గుంతలు పూర్తయ్యాయి. ఇటీవల  కలెక్టర్‌ భారత్‌ హోళికేరి వచ్చి వంద శాతం  నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. దీం తో సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకుని పనులు చేపడుతున్నారు. నందులపల్లి, నెన్నె ల, గొల్లపల్లి, ఘన్‌పూర్‌, చిత్తాపూర్‌, ఆవు డం, మైలారం గ్రామాల్లో పనులు వేగవం తం చేస్తున్నారు. 


logo