శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Feb 08, 2020 , 23:46:25

ఏకగ్రీవాల జోరు

ఏకగ్రీవాల జోరు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లావ్యాప్తంగా 20 సొసైటీల పరిధిలోని 260 నియోజకవర్గాలకు 258 మంది సభ్యులను ఎన్నుకోనున్నా రు. వీటికి మొదటి రోజు 25, రెండో రోజు 196 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చివరి రోజైన శనివారం 451 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని చోట్ల చివరి వరకు ఎదురుచూసి సభ్యులు నామినేషన్లు వేశారు. చాలా చోట్ల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. చంద్రవెళ్లి సహకార సంఘానికి అత్యధికంగా 56 నామినేషన్లు దాఖలు కాగా, వేమనపల్లి సంఘానికి అత్యల్పంగా 14 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగా.. శనివారం నామినేషన్లు పూర్త య్యే సమయానికి 60 స్థానాలు ఏకగ్రీవం అయ్యా యి. ఇందులో అత్యధికంగా వేమనపల్లి మండలం లో 12, నెన్నెల మండలంలో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చెన్నూరులో 7, మందమర్రిలో 6, గుల్లకోట, గూడెంలో 5 స్థానాల చొప్పున ఏకగ్రీవమయ్యాయి. పడ్తన్‌పల్లి, జైపూర్‌లో 4 స్థానాల చొప్పున, ఇటిక్యాల, చింతగూడల్లో 2 స్థానాలు.. మంచిర్యాల, కర్ణమామిడిలో 1 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యాయి. 

టీఆర్‌ఎస్‌ ఖాతాలో మూడు

జిల్లాలో నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకే మూడు సొసైటీలు టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి, నెన్నెల సంఘాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరాయి. వేమనపల్లిలో ఉన్న 13 స్థానాలకు 12 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అన్నీ టీఆర్‌ఎస్‌వే కావడం గమనార్హం. ఇక ఆ ఒక్క స్థానంలో కూడా కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఆదివారం ఆ ఒక్క నామినేషన్‌ ఉపసంహరించేలా కసరత్తు చేస్తున్నారు. నెన్నెల సంఘంలోని 13 స్థానాలకు 11 ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ సమర్థిస్తున్న అభ్యర్థులు ఏడుగురు ఉండగా, ఇద్దరు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్‌ వారు ఉన్నారు. మిగతా రెండింటిని కూడా ఏకగ్రీం అయ్యేలా చూస్తున్నారు. ఇది కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే చేరింది. చెన్నూరుకు సంబంధించి ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా, అక్కడ కూడా టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. మిగతా వాటిల్లో 90 శాతం వరకు టీఆర్‌ఎస్‌ బలపరుస్తున్న వారే ఏకగ్రీవం కావడం గమనార్హం.

విజయానికి కసరత్తు

సహకార సంఘాల ఎన్నికల్లో విజయానికి నేత లు కసరత్తు చేస్తున్నారు. సంఘంలో సభ్యుడు(డైరెక్టర్‌)గా గెలిచేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఓ టర్ల జాబితా పరిశీలిస్తూ అనుకూలంగా ఎంతమం ది.. ఎన్ని ఓట్లు వస్తే గెలుస్తామనే అంశాలపై కసరత్తు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉన్న కొద్ది మందిని తమ వైపు తిప్పుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జిల్లాలో ఉన్న వాటిల్లో  5 సంఘా ల్లో ఒక్కో వార్డులో 50 కన్నా తక్కువ ఓటర్లు ఉండ టం గమనార్హం. కొన్ని చోట్ల కేవలం 11 ఓట్లు వస్తే గెలిచినట్టే. ఇలాంటి చోట్ల కచ్ఛితంగా గెలుపు సాధించాలని ముందకు సాగుతున్నారు. అదే సమయం లో ఎట్టి పరిస్థితుల్లో విజయ పీఠం సాధించేందుకు అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి.