శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Feb 08, 2020 , 23:40:53

గంగాజలం తెచ్చి.. అభిషేకించి..

గంగాజలం తెచ్చి.. అభిషేకించి..

రామకృష్ణాపూర్‌ : గాంధారి మైసమ్మ జాతర రెండవ రోజు నాయక్‌పోడ్‌ గిరిజన సంప్రదాయంలో వైభవంగా సాగిం ది. మంచిర్యాల గోదావరి నుంచి తెచ్చిన గంగాజలంతో గ్రామ దేవతలు బొక్కలగుట్ట నల్లపోశమ్మను, భీమన్నను అభిషేకించి శుద్ధిచేశారు. గ్రామం నుంచి కిలోమీటరు దూ రాన ఉన్న కొలువై ఉన్న గాంధారి మైసమ్మ తల్లికి పసుపు, కుంకుమలు, కొబ్బరికాయలు, యాటపోతులతో మొ క్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత గ్రామ దేవత నల్లపోశమ్మకు, భీమన్నకు భక్తిశ్రద్దలతో నైవేద్యాలు సమర్పించారు. సదర్ల(దారి) భీమన్న వద్ద పట్నాలు వేసి తప్పెటగూళ్లతో నాయక్‌పోడ్‌ పూజారులు కొలిచి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం సాయంత్రం తప్పెటగూళ్లు, పిల్లనగ్రోవు ల నాదంతో కళాకారుల నృత్యాల నడుమ ఊరేగింపుగా ఖి ల్లా దిగువ భాగానికి నదీ జలాలను తీసుకువెళ్లారు. దిగువ భాగాన ఉన్న చెలిమ నీళ్లు 41ఘటాల (కొత్త పటువల/కూరాడు కుండలు)లతో నాయక్‌పోడ్‌ కుల వంశ స్త్రీలు తీసుకవెళ్లి కోట ప్రథమ ద్వారం వద్ద కొలువై ఉన్న కాలభైరవునికి అభిషేకం చేసి పసుపు, కుంకుమలతో పూజించా రు. ఆ తర్వాత కోట ప్రధాన ద్వారంపై కొలువై ఉన్న మైస మ్మ తల్లి(లక్ష్మీదేవర)ని గంగాజలంతో అభిషేకించి శుద్ధిచేసి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పన్నెండు తలల నాగశేషున్ని, విఘ్నేశ్వరున్ని, ఆంజనేయు న్ని శివపార్వతులను గంగాజలంతో అభిషేకించి పూజలు చేశారు. తెల్లవార్లు కొండ దిగువన నాయక్‌పోడ్‌ గిరిజనుల సాంప్రదాయ కాళారూపాలు, గిరిజనుల సంస్కృతీ సాంప్రదాయ లక్ష్మీదేవర, కృష్ణస్వామి(శ్రీకృష్ణుడు), పోతరాజు, మదన పోచమ్మ, మాంతమ్మ, చంద్రమ్మ, పంచపాండవుల ముఖతొడుగులు ధరించి తప్పెటగూళ్లు, పిల్లనగ్రోవుల వా యిద్యాల నడుమ ప్రదర్శించే కళారూపాలు, నృత్యాలు భ క్తులను అలరించాయి. జాతరకు వచ్చిన భక్తులు రాత్రంతా కళారూపాలు చూస్తూ గడిపారు. అర్ధరాత్రి దాటాక కోట ప్రధాన ద్వారం వద్ద కొలువై ఉన్న మైసమ్మ దేవత వద్ద మూడు రంగులతో పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు.

 నేడు భక్తులకు దర్శనం..

తెల్లవారుజాము సుమారు 4 గంటకులకు మైసమ్మ తల్లికి యాటలు బలిచ్చి, దున్నపోతును మొక్కి వదిలివేస్తారు. రెండు గంటల విరామం తర్వాత ఉదయం 6గంటల నుంచి జాతరకు వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాల్లో పూజారులు జైనేని భీమయ్య, రొడ్డ రాజయ్య, రొడ్డ కిష్టయ్య, రొడ్డ పెద్దులు, పెద్ది చంద్రయ్య, లౌవుడం మైసయ్య, కట్ర చిన్నయ్య, ఒలికినేని రవి, గరిగంటి భీమయ్య, నాయక్‌పోడ్‌ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది రాజన్న, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి మేచినేని రాజన్న, ఆలయ కమిటీ అధ్యక్షుడు గంజి రాజన్న, రొడ్డ రమేశ్‌, పల్ల సత్యనారాయణ, గంజి రాజన్న పసుల బుచ్చయ్య, కుటుంబ సభ్యులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

 జాతరకు భారీ బందోబస్తు..

డీసీపీ ఉదయ్‌కుమార్‌ గాంధారి ఖిలాన్లు శనివారం సా యంత్రం మైసమ్మ తలిన్లి దర్శించుకొని పూజలు చేశారు. శని, ఆదివారాలు కీలకమైనవనీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మందమర్రి సీఐ ఎడ్ల మహేశ్‌, బెల్లంపల్లి రూరల్‌ సీఐ జగదీశ్‌, 6 మంది ఎస్సైలు, 70మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా ఆకతాయులు ఇబ్బందులు కలిగిస్తే వెంటనే పోలీసు సిబ్బందికి, షీటీమ్‌లకు తెలపాలన్నారు. మందమర్రి సీఐలు ఎడ్ల మహేశ్‌, జనార్దన్‌రెడ్డి, నాగరాజు, రామకృష్ణాపూర్‌ ఎస్సై రవిప్రసాద్‌, మందమర్రి ఎస్సై శివకుమార్‌, దేవాపూర్‌ ఎస్సై దేవయ్య, కాసిపేట్‌ ఎస్సై రాములు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.


logo