ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Feb 08, 2020 , 03:57:49

నామినేషన్ల కోలాహలం

నామినేషన్ల కోలాహలం

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌) ఎన్నికల కోసం రెండో రోజు శుక్ర వా రం మంచిర్యాల పీఏసీఎస్‌కు తొమ్మిది మంది అభ్యర్థులు 11 నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల అధికారి, మం చిర్యాల వ్యవసాయాధికారి కృష్ణ, సీఈఓ సత్యనారాయణ తెలిపారు. మొదటి రోజు ఐదు నామినేషన్లు, రెండవ రోజు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల ఎనిమిదవ తేదితో నామినేషన్లకు ఆఖరు రోజు కావడంతో నేడు అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

మంచిర్యాల రూరల్‌ : హాజీపూర్‌ మండలం కర్నమామిడి సహకార పరపతి సంఘంలో రెండో రోజు ఎనిమిది నామినేషన్లు, పడ్తన్‌పల్లి సహకార సంఘంలో పదవులకు నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు రజిత,హన్మాండ్లు తెలిపారు. 

దండేపల్లి : నెల్కివెంకటాపూర్‌, గూడెం పీఏసీఎస్‌ల నుంచి రెండో రోజు 38 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల ప్రత్యేకాధికారులు అంజిత్‌కుమార్‌, శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపారు. నెల్కివెంకటాపూర్‌ పరిధిలో 19, గూడెం సహాకార సంఘంలో 19 మంది నామినేషన్‌ దాఖలు చేశారు. దండేపల్లి 13వ వార్డు డైరెక్టర్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ బలపరుస్తున్న నెల్కివెంకటాపూర్‌ సంఘం చైర్మన్‌ అభ్యర్థి కసనగొట్టు లింగన్న నామినేషన్‌ దాఖలు చేశారు. మొదటి రోజు 1, రెండో రోజు 38 మొత్తం 39 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మోటపల్కుల గురువయ్య, వైస్‌ ఎంపీపీ అనిల్‌, మాజీ వైస్‌ ఎంపీపీ ఆకుల రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు.

జన్నారం : పొనకల్‌, చింతగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్‌ పదవులకు కోసం శుక్రవారం పొనకల్‌లో 17, చింతగూడలో 14నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు పొచయ్య, మల్లయ్య తెలిపారు.


logo