మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Feb 07, 2020 , 02:03:12

కొలువుదీరిన సమ్మక్క..

కొలువుదీరిన సమ్మక్క..

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మంచిర్యాల పట్టణ సమీప గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన సమ్మక్క - సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయం కంకవనం నుంచి సమ్మక్కను కోయ పూజారులు కృష్ణ దొర, వెంకటేశ్‌, రామకృష్ణ సాయంత్రం ఆరు గంటలకు గద్దెకు తీసుకువచ్చారు.  సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరైనట్లు దేవాదాయ శాఖ ఈవో రవి కుమార్‌ తెలిపారు.     జాతరలో వెలిసిన దుకాణాలలో భక్తులు వివిధ వస్తువులు కొనుగోలు చేసుకున్నారు. భక్తులు జాతరలో తాత్కాలిక డేరాలు వేసుకొని వంటలు చేసుకొని భోజనాలు చేశారు. జాతరలో డీసీపీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సీఐలు ముత్తి లింగయ్య, ప్రవీణ్‌ కుమార్‌(ట్రాఫిక్‌), ఎస్సైలు మారుతి, రాజమౌళి గౌడ్‌, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అలాగే మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి ఆధ్వర్యంలో మున్సిపాలిటి సిబ్బంది పరిశుభ్రత పనులు నిర్వహించారు.  డీఎంహెచ్‌ఓ భీష్మ ఆధ్వర్యంలో భక్తులకు కావల్సిన ప్రథమ చికిత్స అందిస్తూ మందులు పంపిణీ చేస్తున్నారు.  జాతరను ఎమ్మెల్యే దివాకర్‌రావు, వైస్‌ చైర్మన్‌ గాజుల ముఖేష్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, కౌన్సిలర్లతో కలిసి పర్యవేక్షించారు


logo