గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Feb 06, 2020 , 00:19:10

మూడో లైనుకు నిధులు

మూడో లైనుకు  నిధులు
  • రైల్వేలతో కూడిన సాధారణ బడ్జెట్‌లో కేటాయింపు
  • ఊసేలేని నాలుగో లైను, మంచిర్యాల-గడ్చిరోలి సర్వే
  • అటకెక్కిన రైళ్ల హాల్టింగ్‌, కొత్త ప్రతిపాదనలు
  • ఇక చక చకా సాగనున్న పనులు



(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ)రైల్వే బడ్జెట్‌లో మూడవ లైన్‌కు కాజిపేట-బల్లార్షా మధ్య మూడో లైనుకు నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైల్వే బడ్జెట్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందు లో రైల్వేకు కేటాయించిన మౌలిక వసతుల కల్పనతో పాటు ఇతర గ్రాంటులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇందులో కాజిపేట-బల్లార్షకు మూడో లైను కింద రూ.483 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 201.4 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్‌ నిరంతరం పవర్‌ప్లాంట్లు, బొగ్గు, సిమెంట్‌ రవాణా, ప్రయాణికులతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే అదనపు లైన్‌ లేక చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ, రైళ్లు పెంచాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. దీనితో ఎంపీ విజ్ఞాపణలు అందజేశారు.


రూ.2063 కోట్ల అంచనా వ్యయం..

కాజీపేట-బల్లార్షా మధ్య మూడో లైన్‌ డిమాండ్‌ తరచూ వినిపిస్తుండడంతో 2015-16లో 201.4 కిలోమీటర్లు పొడవున్న ఈ మూడోలైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అంచనా వ్యయం రూ.2063 కోట్లుగా నిర్ధారించింది. ఐదేండ్లలో ఈ మూడవ లైను ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు. అదే విధంగా 2017లో మూడో లైను కోసం రూ.160 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, నాలుగో లైనుకు సర్వే చేయాలని భా వించింది. అలాగే మంచిర్యాల-గడ్చిరోలికి సర్వే చేయాలని భావించగా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఐదేండ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు సరైన కేటాయింపులు లేక ముందడుగు పడడం లేదు. దీంతో మరో  రెండు, మూడేండ్లు పట్టే అవకాశం ఉంది.


బడ్జెట్‌లో రూ.483 కోట్లు కేటాయింపు..

రాఘవపురం, పొత్కపల్లి, బిజగిరి షరీఫ్‌, ఉప్పల్‌, వీరూరు, మాణిక్‌ఘర్‌లో పనులు పూర్తయ్యాయి. మిగితా చోట్ల పనులు చురుకుగా కొనసాగుతున్నా యి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020-2021 రైల్వే బడ్జెట్‌లో రూ.483 కోట్లు విడుదల చే సింది. దీనితో పనులు చురుకుగా కొనసాగే అవకా శం ఉంది. ఇదే సమయంలో మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేదని పలువురు కోరుతున్నారు. అంతేకాకుండా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైళ్ల హాల్టింగ్‌, కొత్త రైళ్ల ప్రతిపాదన చెవికి ఎక్కించుకోలేదు. నాలుగో లైను సర్వే కానీ, మంచిర్యాల-గడ్చిరోలి సర్వేపై కానీ దృష్టిపెట్టలేదు.


logo