శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Feb 06, 2020 , 00:19:09

వనవెల్లి ప్రణమిల్లి

వనవెల్లి ప్రణమిల్లి

గిరిజన సంప్రదాయ పద్ధతిలో తొలిఘట్టం పూర్తయ్యింది. బుధవారం సాయంత్రం కన్నెపల్లి కల్పవల్లి గద్దెపై ఆసీనురాలైంది. సారలమ్మ వేంచేస్తున్న ఉద్విగ్న క్షణాన.. వనమంతా ప్రణమిల్లింది. ఎదురేగి వరం పట్టింది. దీంతో మేడారం మహా జాతర ప్రారంభమైంది. ఉదయమే కాక వంశీయులు గద్దె ప్రాంగణాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం పసుపు, కుంకుమ, చీర, సారెను సమర్పించారు. సాయంత్రం కన్నెపల్లి గుడి నుంచి గద్దె వద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలు జంపన్న వాగులో స్నానమాచరించారు. సారలమ్మను దర్శించుకొని తన్మయత్వం పొందారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో జంపన్నవాగు, పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మలిఘట్టమైన తల్లి సమ్మక్క రాకకోసం కోట్ల కన్నులు ఎదురుచూస్తున్నాయి. - నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌


logo