గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Feb 06, 2020 , 00:12:13

కుట్టుశిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

కుట్టుశిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

లక్షెట్టిపేట : మహిళలు కుట్టు శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళీకేరి కోరారు. లక్షెట్టిపేటలోని బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో సంపత్‌లాల్‌ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో ఏర్పాటుచేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని బుధవారం మున్సిపల్‌  చైర్మన్‌ కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఇక్కడ కలెక్టర్‌ మాట్లాడు తూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఉపాధి పొందాలన్నారు. ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధనలో భాగంగా అక్షర తెలంగాణ, హరిత తెలంగాణ, పారిశుధ్య తెలంగాణ అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ప్రతి ఒక్కరు చదువుకోవాలనీ, చదువుకు వయస్సుతో సంబంధం లేదన్నారు. లేకపోతే ప్రస్తుత కంప్యూటర్‌ యుగంలో ఇబ్బందులు తప్పవన్నారు. అంతకుముందు విద్యార్థులకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బెంచీలను, డిక్షనరీలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌, ఎంఈవో రవీందర్‌, ఎమ్మార్వో పుష్పలత, డీఆర్‌పీలు తిరుపతి, ప్రకాశం, హెచ్‌ఎం భాగ్యలక్షి, శిక్షకురాలు వరలక్ష్మి ఉన్నారు.


logo