గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Feb 04, 2020 , 01:03:11

బాధితులకు న్యాయం చేయండి

బాధితులకు న్యాయం చేయండి

నెన్నెల : ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. సోమవారం నెన్నెల ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పలువురు తమకు న్యాయం జరుగడం లేదనీ, పలుమార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో కలెక్టర్‌ అధికారులపై మండి పడ్డారు. ఒక్క ఫిర్యాదు దారుడు ఎన్ని సార్లు వస్తాడనీ, పదే పదే అవే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారా.. లేకా చెత్త బుట్టల్లో వేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రైతు పట్టాదార్‌ పాస్‌ పుస్తకం కోసం ఎన్ని సార్లు అధికారుల చుట్టు తిరుగుతాడని ఇప్పటి వరకు ఎందుకు పుస్తకం ఇవ్వలేదన్నారు. బదిలీపై వెళ్లిన వీఆర్‌ఓ దగ్గర ఉన్నాయని చెప్పగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీపై వెళ్లిన వ్యక్తి వద్ద ఎందుకు ఉన్నాయనీ, ఏడాదిగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మందమర్రిలో ఉంటున్న వీఆర్‌ఓ మహబూబ్‌కు కలెక్టర్‌ స్వయంగా ఫోన్‌ చేయగా అతని ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ ఉండడంతో అక్కడి తాసిల్దార్‌కు ఫోన్‌ చేశారు. వీఆర్‌ఓను కలెక్టరెట్‌కు వచ్చి కలువాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాలు లేకపోడానికి ఆపరేటర్‌ నిర్లక్ష్యం చేశాడని అతడిని సస్పెండ్‌ చేసింది. మెట్‌పల్లి వీఆర్‌ఓ సక్రమంగా పనులు చేయడం లేదని మెమో జారీ చేశారు. ఫిర్యాదుదారులను గౌరవించి వారికి సత్వర న్యాయం చేస్తే ఏవి పెండింగ్‌లో ఉండవన్నారు. పాస్‌ బుక్కు మంజూరైన రైతులకు పాస్‌ బుక్కు రాక పోవడంతో వెంటనే ఆన్‌లైన్‌లో ప్రొసీడింగ్‌ తీసి అందించారు. ప్రత్యేక అధికారి రాజ్‌కుమార్‌, తాసిల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ వరలక్ష్మి, ఏపీఏం విజయలక్ష్మి, డాక్టర్‌ అనీష్‌ దిలీప్‌, ఏఈఓ రాజ్‌కుమార్‌, ఆయా శాఖలు సిబ్బంది పాల్గొన్నారు.


తాజావార్తలు


logo