శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Feb 04, 2020 , 01:02:40

సీపీఆర్‌ఎంఎస్‌ వినియోగించుకోవాలి

సీపీఆర్‌ఎంఎస్‌ వినియోగించుకోవాలి

సీసీసీ నస్పూర్‌ : కాంట్రిబ్యూటరీ రిటైర్డ్‌మెంట్‌ మెడికల్‌ స్కీం(సీపీఆర్‌ఎంఎస్‌)ను విశ్రాంత కార్మికులు వినియోగించుకోవాలని సింగరేణి పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌ జీఎం బసవయ్య సూచించారు. సోమవారం సీసీసీ సింగరేణి అతిథి గృహంలో సీపీఆర్‌ఎంఎస్‌పై శ్రీరాంపూర్‌, సింగరేణి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ సంక్షేమాధికారులతో శ్రీరాంపూర్‌ ఇన్‌చార్జి జీఎం చింతల శ్రీనివాస్‌తో కలిసి బసవయ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సంక్షేమాధికారులు, క్లర్క్‌లతో పలు అంశాలపై చర్చించారు. స్కీం అమలు తీరు, సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్త సీపీఆర్‌ఎంఎస్‌ సవరణ ప్రకారం సింగరేణి ఉద్యోగి తప్పకుండా రూ.40వేలు చెల్లించాలన్నారు. ఈ మొత్తం చెల్లించిన వారు రూ.8లక్షల వరకు వైద్య ఖర్చుల ప్రయోజనం పొందుతారని తెలిపారు. గత వేజ్‌బోర్డు ప్రకారం కొంత మొత్తాన్ని నిర్ణయించి రూ.5 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉండేదని తెలిపారు. పథకానికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఉద్యోగులే కాకుండా వారి  పిల్లలకు అదనంగా రూ.20 వేలు కట్టి కార్డు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శ్రీరాంపూర్‌లో 4560 మంది రిటైర్డ్‌ కార్మికులకు గాను 3500మంది ఇప్పటి వరకు రూ.40 వేలు కట్టినట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పర్సనల్‌ విభాగం డీజీఎంలు గోవిందరాజు, సాల్మన్‌రాజు, కవితానాయుడు, నికోలస్‌, ఐటీ డీజీఎం హరిశంకర్‌, డీవైపీఎంలు ముకుంద సత్యనారాయణ, ఉదయ్‌ మోహన్‌, రాజేశ్వర్‌రావు, రాజేశ్వర్‌, ఎస్టీపీపీ అధికారులు అరవింద్‌, సీనియర్‌ పీఓ శ్రీకాంత్‌, అన్ని గనుల సంక్షేమాధికారులు పాల్గొన్నారు. 

సీపీఆర్‌ఎంఎస్‌పై అవగాహన

మందమర్రి రూరల్‌ : మందమర్రి ఏరియా జీఎం కార్యాయలంలోని కాన్ఫరెన్స్‌ హాలు సోమవారం సీపీఆర్‌ఎంఎస్‌ (కంట్రబ్యూటరీ పోస్టు రిటైర్డ్‌మెంట్‌ మెడికేర్‌ స్కీం) పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీఎం రమేశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కొత్తగా ఈ స్కీం కోసం వెబ్‌సైడ్‌లో ఆప్లికేషన్స్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం కారుణ్య ఉద్యోగాలు, కార్మికులు ఉద్యోగ విరమణ పోందిన తర్వాత వచ్చే పరిహారం తదితర విషయాలపై చర్చించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ జీఎం పర్సనల్‌ వెల్ఫేర్‌ అండ్‌ సీఎస్‌ఆర్‌ కే. బసవయ్య, డీవైజీఎం పర్సనల్‌ కవితనాయుడు, సాల్‌హన్‌, హరీ శంకర్‌, సత్యనారాయణ, శ్రీకాంత్‌, పీఎం మురళీధర్‌రావు, డీవైపీఎంలు శ్యామ్‌సుందర్‌, రెడ్డి మల్ల తిరుపతి, మందమర్రి, బెల్లంపల్లి గనుల సంక్షేమ అధికారులు, క్లర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.  


logo