శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Feb 04, 2020 , 00:59:00

జాతర ఏర్పాట్లను పరిశీలించిన సీఐలు

జాతర ఏర్పాట్లను పరిశీలించిన సీఐలు

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మంచిర్యాల పట్టణ సమీప గోదావరి నదీ తీరంలో నిర్వహించనున్న సమ్మక్క - సారలమ్మ జాతర జరిగే ప్రాంతాన్ని మంచిర్యాల పట్టణ సీఐ ముత్తె లింగయ్య, ట్రాఫిక్‌ సీఐ ప్రవీణ్‌ కుమార్‌లు సోమ వారం పరిశీలించారు. అమ్మ వారి గద్దెల చుట్టూ తిరిగి బారికెడ్లు ఎలా వేయాలో సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలో తెలిపారు. చెత్తను తొలగించాలని నిర్వాహకులకు సూచించారు. భక్తులకు ఇబ్బంది లేకుం డా ఉండాలన్నారు. వీరి వెంట ఎస్‌ఐలు ప్రవీణ్‌ కుమార్‌, మారుతి, రాజమౌళి గౌడ్‌, దేవాదాయ శాఖ ఈఓ రవి కుమార్‌, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

నేటి నుంచి జాతరకు బస్సులు

మంచిర్యాల పట్టణ సమీప గోదావరి నదీ తీరంలో నిర్వహించే సమ్మక్క - సారలమ్మ జాతరకు నేటి నుంచి మంచిర్యాల బస్టాండ్‌ నుంచి బస్సులు నడుపనున్నట్లు మంచిర్యాల ఆర్టీసీ డీఎం మేకల మల్లేశయ్య తెలిపారు. పెద్ద వారికి రూ. 15, పిల్లలకు 10 రూపాయలుగా టికెట్‌ నిర్ణయించామన్నారు. ఈ నెల ఆరో తేదీ వరకు బస్సులు నడుపుతామని డీఎం తెలిపారు. 


logo