బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Feb 01, 2020 , 23:19:58

ఆశ.. నిరాశే!

ఆశ.. నిరాశే!
  • కేంద్ర బడ్జెట్‌పై పెదవివిరుపు
  • బడ్జెట్‌పై జిల్లావాసుల మనోగతం
  • మన రైతు బంధుకు ప్రశంసల వెల్లువ
  • అన్ని రంగాలకు తీరని అన్యాయమని వెల్లడి
  • ఎల్‌ఐసీ వాటాల విక్రయాల నిర్ణయంపై నిరసన
  • కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా అంశంపై ఊసేత్తని కేంద్రం
  • ఆదాయ పన్ను శ్లాబ్‌లోనూ గందరగోళం

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం లోక్‌సభలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను నిశీతం గా పరిశీలిస్తే.. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల కో ణంలో చూస్తే నిరాశే మిగుల్చుతోంది. ముఖ్యంగా యావత్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన, నిలుస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కా లంగా కోరుతోంది. ఈ ప్రాజెక్టును అత్యంత వేగవంతంగా పూర్తి చేసి.. ఆచరణలో తెలంగాణ ప్ర భుత్వం తన సత్తాను యావత్‌ ప్రపంచానికి చాటి చెప్పింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విజయ పరంపరను దృష్టిలో పెట్టుకొని అయినా కేంద్రం జాతీయ హోదా కల్పిస్తుందని ఆశించింది. కానీ.. ఈ ప్రాజెక్టు ఊసే కేంద్ర బడ్జెట్‌లో ఎత్తలేదు. జా తీయ హోదా కల్పించక పోయినా.. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా నిధులు కేటాయిస్తున్నట్లుగా చెప్పలేదు. జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. ఉమ్మడి జిల్లాకు అన్ని రకాల ప్రయోజనాలను చేకూరేవి. కేంద్రం ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేస్తున్నట్లుగా చెప్పిన ప్రభుత్వం.. లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించే కాళేశ్వరం ప్రా జెక్టును ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేద న్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


ఈ వి షయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలన్న డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. ఆదాయ పన్ను పరిమితి విషయంలో కొత్త శ్లాబ్‌లను ప్ర భుత్వం ప్రకటించింది. అయితే.. మొదటి ఒకటి రెండు శ్లాబ్‌లలో రేట్లు తగ్గించినట్లుగా కనిపిస్తు న్నా.. ప్రభుత్వం పలు విషయాలపై స్పష్టత నివ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. రూ. 2.50 లక్షల నుంచి రూ5 లక్షల వరకు ఉన్న శ్లాబ్‌ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. పాత విధానం అంటే గతేడాది అమలులో ఉన్న శ్లాబ్‌ పద్ధతిని, తాజా శ్లాబ్‌ను ఎంపిక చేసుకునే వెసలుబాటును కల్పించినా.. అందులో తలెత్తుతున్న అనేక అనుమానాలపై స్పష్టత లేకపోవడంపై విమర్శలు వ్య క్తం అవుతున్నాయి. ఉదాహరణకు ఎవరైనా ఉద్యో గి కొత్త శ్లాబ్‌ను ఎంపిక చేసుకుంటే.. అది అతనికి ఉపయుక్తంగా లేదని భావించినప్పుడు తిరిగి పాత శ్లాబ్‌కు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షలలోపు శ్లాన్‌కు సంబంధించి పాత విధానాన్నే ఎంచుకొని రిటర్న్‌ ఫైల్‌ చేస్తే.. సదరు వ్యక్తి భవిష్యత్‌లో ఎప్పుడైనా కొత్త విధానానికి మారేందుకు అవకాశం ఉంటుందా? లేదా? అన్న విషయంలోనూ స్పష్టత లేకపోవడంపై గందరగోళం నెలకొంది. 


అలాగే భారతదేశ అర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలుస్తున్న ఎల్‌ఐసీ సంస్థలోని వాటాలను విక్రయాలు చేయాలని నిర్ణయించినట్లుగా కేంద్రం శనివారం ప్రకటించిన విషయంపై ఆ సంస్థ వర్గాలు భగ్గుమన్నాయి. అత్యంత లాభాలతో నడుస్తున్న ఎల్‌ఐసీలోని వాటాలను విక్రయాలను చేయాలని నిర్ణయం తీసుకోవడం అత్యంత చీకటి దినంగా ఆ సంస్థ ఉద్యోగులు అభివర్ణించారు. రూ.31 లక్షల కోట్ల ఆస్తులు కలిగి 30 కోట్లకు పైగా పాలసీదారులకు భద్రత కల్పిస్తు అత్యంత నమ్మకంగా 60 సంవత్సరాలుగా పైగా సేవలందిస్తున్న ఎల్‌ఐసీనీ స్టాక్‌ మా ర్కెట్‌లో లిస్టింగ్‌ చేయాలని అనడం అత్యంత దు రదృష్టకరమైన పరిణామంగా పేర్కొన్నారు. క్రమక్రమంగా.. ఎల్‌ఐసీని బీఎస్‌ఎన్‌ఎల్‌, బీపీసీఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ వంటి సంస్థల మాదిరిగానే పెట్టుబడులు ఉపసంహరించి సంస్థను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే క్రమంలో ఇది మొదటి అడుగుగా భా విస్తున్నట్లుగా ఉద్యోగులు విమర్శిస్తున్నారు. విద్య, వైద్య రంగానికి కేటాయింపులు సక్రమంగా చేయ డం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం అందించే రాయితీలు అందిస్తున్నట్లే అందించి, వాటికి కూడా మెలికలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభజన రాష్ర్టాలకు ముఖ్యంగా తెలంగాణకు సరిపడా నిధులు లేక మొండిచేయి చూపారని అంటున్నా రు. ఆర్థిక సర్వేలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుకు పెట్టుబడి సాయం పథకం రైతు బంధును ప్రశించారు. 


logo