గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Feb 01, 2020 , 03:37:02

అట్టహాసంగా..అంతఃప్రజ్ఞ

అట్టహాసంగా..అంతఃప్రజ్ఞ
  • బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రారంభమైన ‘టెక్‌ ఫెస్టివల్‌'
  • అభినందించిన అతిథులు
  • ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
  • హాజరైన వీసీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ ప్రశాంతి
  • మూడు రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం

సర: ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో మూడురోజు ల పాటు నిర్వహించే గ్రామీణ సాంకేతిక పండుగ అంతఃప్రజ్ఞ-2020 కార్యక్రమం శుక్రవారం ఘ నంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వీసీ అశోక్‌కుమార్‌, ముఖ్య అతిథిగా కలెక్టర్‌ ప్రశాంతి పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఐఏఎస్‌ ట్రైనీ అఖిల రాఘవేందర్‌, పర్వాతారోహణ శిక్షకుడు శేఖర్‌బాబు, డెల్‌ కంపెనీ సీనియర్‌ మెనేజర్‌ రఘు రాం అంటోస్‌, సాఫ్ట్‌స్కిల్‌ శిక్షకుడు మనోహారన్‌ హాజరయ్యారు. కలెక్టర్‌ ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో చదివే గ్రామీణ పేద విద్యార్థులు దాదాపు ఈ అంతఃప్రజ్ఞలో 300కు పైగా నమూనాలను ప్రదర్శించారని, అంతే కాకుండా ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకతను బయటకు తీయడానికి దోహదపడుతుందన్నారు. 


గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇక్కడి వి ద్యార్థులకు అవగాహన ఉందన్నారు. ఆ సమస్యలను వారు నేర్చుకున్న సాంకేతిక విద్య ద్వారా పరిష్కారం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయం, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంలో కీలకమైందని, వ్యవసాయానికి సంబంధించిన ఆధునాతన సాంకేతిక యంత్ర పరికరాలను ప్రతి ఒక్కరితో ఉపయోగించి ఎక్కువ దిగుబడి రావడానికి వీలుగా విద్యార్థులు పలు ప్రదర్శనలు ఇస్తున్నారని అన్నారు. జిల్లాలోని కొయ్యబొమ్మలను ప్రపంచంలోని ఏ మూల నుంచైనా కొనుగోలు చేయడానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా గతంలోనే విద్యార్థులు రూపొందించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్‌ లిటరసీ కార్యక్రమంలో భాగంగా బాసరను మొట్టమొదటి డిజిటల్‌ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు కీలక పాత్ర పోశించారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో వెబ్‌కాస్టింగ్‌ కూడా విద్యార్థులు నిర్వహించారన్నారు.


విద్యార్థుల్లో చాలా ప్రతిభ ఉంది

బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో చదివే విద్యార్థుల్లో చాలా ప్రతిభ ఉందని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం అన్ని వేళ లా పని నమూనాలను అభివృద్ధి చేయడంలో సహాయ సహకారాలు ఉంటాయన్నారు. జిల్లాలో ని వ్యవసాయ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను యూనివర్సిటీకి పంపించి పలు నమూనాలను పరిశీలించి వాటి ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన సూచనలను ఇ వ్వాలని కోరుతామన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ నగరాల గురించే ఆలోచిస్తున్నారని కానీ స్మార్ట్‌ గ్రా మీణం తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ఇక్కడ రూపొందించిన స్మార్ట్‌ విలేజ్‌ పలువురిని ఆకర్షించిందన్నారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన పలువురు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న స్టార్టప్‌ స్టాండ్‌ ఆఫ్‌ ఇండియా, మేకిన్‌ ఇం డియా, టీ-హబ్‌, వీ-హబ్‌ లాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. 


ప్రదర్శనలు తిలకించిన కలెక్టర్‌

పలు విభాగాల విద్యార్థులు రూపొందించిన విజ్ఞాన మేళాను కలెక్టర్‌ ప్రశాంతితో పాటు ప్రముఖులు తిలకించారు. సీఎస్‌ఈ విభాగం వారు త యారు చేసిన స్మార్ట్‌ విలేజ్‌ను కలెక్టర్‌ ప్రశాంతి పరిశీలించి గ్రామీణులకు అవసరమయ్యే పలు సూచనలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు. అనంత రం వీసీ అశోక్‌కుమార్‌ కార్యక్రమానికి వచ్చిన అతిథులు రోబోటిక్‌, మొజాయిక్‌, గ్రాఫిక్స్‌ అండ్‌ డిటెక్షన్‌తో పాటు సివిల్‌ విభాగం వారు కళాశాల బయట నిర్మించిన బస్టాప్‌ను వీసీ ప్రారంభించారు. ఏవో రాజేశ్వర్‌రావు, డీన్‌ దేవ్‌రాజ్‌, రంజీత్‌, అంతఃప్రజ్ఞ కన్వీనర్‌ స్వప్నిల్‌, కో కన్వీనర్‌ హరిబాబు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌ రవికాంత్‌, ఏఆర్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ మూర్తి, పలు విభాగాల హెచ్‌వోడీలు, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo