మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jan 31, 2020 , 03:37:26

రైతులు బాగుపడితేనే అభివృద్ధి సాధ్యం

రైతులు బాగుపడితేనే అభివృద్ధి సాధ్యం
  • బెల్లంపల్లి కేవీకేలో ఫిష్‌ పాండ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ భారతి హోళికేరి
  • సాగులో కొత్త విధానాలు అవలంబించాలి
  • కలెక్టర్‌ భారతి హోళికేరి
  • కేవీకే సదస్సులో రైతులు, అధికారులకు సూచనలు

బెల్లంపల్లి రూరల్‌: రైతులు బాగుపడితేనే అభి వృద్ధి సాధ్యమని కలెక్టర్‌ భారతి హోళికేరి సూ చించారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో బింధు, తుంపర్ల సేద్యంపై ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన ఫర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాఫ్‌ పథకంలో భాగంగా గురువా రం నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హా జరయ్యారు. జాతిపిత వర్ధంతిని పురస్కరించుకొ ని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాలన్నారు. మైక్రో ఇరిగేషన్‌ ప్రాముఖ్యతపై రైతుల్లో చైతన్యం తేవాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌ పాం సాగుకు ఇక్కడి నేలలు అనుకూలంగా ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైందన్నారు. 


దీని వైపు రైతులు దృష్టి సారించాలన్నారు. అనంతరం కేవీకేలో ఏర్పాటు చేసిన ఫిష్‌పాండ్‌ను పరిశీలించారు. ఎంపీపీ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షురా లు రాణి, బూదాకలన్‌ సర్పంచ్‌ కోట లక్ష్మి, సహకార సంఘం చైర్మన్‌ సింగతి పెద్దన్న, జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజ్‌కుమార్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాపు, ఏడీఏ సురేఖ, జైన్‌ ఇరిగేషన్‌ ఫ్యాకల్టీ భాష, బెల్లంపల్లి తాసిల్దార్‌ కుమార్‌, కేవీకే శాస్త్రవేత్తలు నాగరాజు, స్రవంతి, మహేశ్‌, శివక్రిష్ణ, ఉద్యాన శాఖ అధికారి సుప్రజ, ఉద్యానశాఖ విస్తరణ అధికారి శేఖర్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నా రు. అనంతరం కలెక్టర్‌ స్థానికంగా ఉన్న తెలంగా ణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలను సందర్శించారు. ఇటీవల జేఈఈ (మెయిన్స్‌)లోప్రతిభ చూపిన వారిని అభినందించారు.  logo