శుక్రవారం 03 జూలై 2020
Mancherial - Jan 30, 2020 , 04:18:55

కిక్కిరిసిన కెస్లాపూర్‌

కిక్కిరిసిన కెస్లాపూర్‌
  • నాగోబా దర్శనానికి బారులు
  • బేతాల్‌ పూజలు నిర్వహించిన మెస్రం వంశీయులు
  • దర్బార్‌కు హాజరైన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • భారీగా తరలివచ్చిన ఆదివాసీలు

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి / ఇంద్రవెల్లి: నాగోబా జాతరకు బుధవారం భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో కెస్లాపూర్‌ రోడ్లన్నీ కిక్కిరిసి కనిపించాయి. గిరివనం భక్తజన సంద్రమైంది. నాగోబా దర్శనానికి గంటల తరబడి బారులు తీరారు. జాతర సందర్భంగా నిర్వహించిన దర్బార్‌కు ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావు, స్పోర్ట్స్‌  అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్‌ దివ్య, ఎస్పీ విష్ణు వారియర్‌, ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.13.75 కోట్లతో నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పోడుభూముల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సాయంత్రం మెస్రం వంశీయులు ఆలయ ఆవరణలో బేతాల్‌ దేవతకు పూజలు నిర్వహించారు. అనంతరం కెస్లాపూర్‌ నుంచి కుటుంబసమేతంగా ఎడ్లబండ్లలో ఉట్నూర్‌ మండలంలోని శ్యామ్‌పూర్‌ గ్రామంలోని బుడుందేవు జాతరకు తరలివెళ్లారు. 


logo