బుధవారం 03 జూన్ 2020
Mancherial - Jan 29, 2020 , 04:14:31

గులాబీ.. ఓట్ల సునామీ..

గులాబీ.. ఓట్ల సునామీ..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ సీట్ల సునామీ సృష్టించింది. పదకొండు బల్దియాల్లో ఓట్ల వర్షం కురిసింది. కారు జెట్‌ స్పీడ్‌కు ప్రతిపక్ష పార్టీలు తునాతునకలయ్యాయి. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్‌, బీజేపీలు రెండు కలిపినా టీఆర్‌ఎస్‌ ఓట్ల శాతం అంతా కూడా లేవు. పది బల్దియాలపై గులాబీ జెండా ఎగురగా.. ఒక్క భైంసాలో మాత్రం ఎంఐఎం పాగా వేసింది. 58.90 శాతం సీట్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. 41.39 ఓట్లను సాధించింది. 22.23 శాతం ఓట్లకు కాంగ్రెస్‌ పరిమితం కాగా.. బీజేపీ 14.25 శాతం, ఎంఐఎం 6.16 శాతం ఓట్లను సాధించాయి. పల్లె పోరులోనే కాదు.. పట్టణ ఎన్నికల్లోనూ గులాబీదే గుత్తాధిపత్యం కొనసాగింది. పుర పోరులో పట్టణ ఓటర్లు టీఆర్‌ఎస్‌కే జై కొట్టారు.

  • పురపోరులో టీఆర్‌ఎస్‌కు గంపగుత్తగా ఓట్లు
  • 41.39 ఓట్ల శాతంతో దూసుకెళ్లిన కారు
  • విపక్షాలకు అందనంత దూరంలో టీఆర్‌ఎస్‌
  • 22.23 శాతం ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్‌
  • 14.25 శాతం బీజేపీకి.. 6.16 శాతం ఎంఐఎం

నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలుండగా.. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ 1/70 యాక్ట్‌ అమలులో ఉండటంతో ఎన్నికలు నిర్వహించ లేదు. 11 మున్సిపాలిటీల్లో ఈనెల 22వ తేదీన ఎన్నికలు నిర్వహించగా.. 25న ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 11 మున్సిపాలిటీలకు గాను 10 బల్దియాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోగా.. భైంసాలో మాత్రం ఎంఐఎం పుర పీఠాన్ని సొంతం చేసుకుంది. జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో 309 వా ర్డులుండగా.. టీఆర్‌ఎస్‌ 182 వార్డులను దక్కించుకొని 58.90 శాతం సీట్లను సాధించింది. ఖానాపూర్‌ లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఈ సంఖ్య 183కు చేరింది. ఇక కాంగ్రెస్‌ 51 స్థానాల తో 16.50 శాతం సాధించింది. బీజేపీ, స్వతంత్రులు చెరో 25 స్థానాలు దక్కించుకోగా.. 8.09 శాతం సీట్ల ను గెలుచుకున్నారు.ఎంఐఎం 22 వార్డులను గెలు చుకొని 7.12 శాతం సీట్లను దక్కించుకుంది. మరో నాలుగు చోట్ల ఇతరులు గెలువగా.. 1.29 శాతం సీట్ల ను సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, తెలంగాణ జన సమితి అసలు బోణీ కొట్టలేదు.


ఓట్లలోనూ గుబాళింపు

టీఆర్‌ఎస్‌ సీట్లలోనూ కాకుండా ఓట్లలోనూ దూసుకుపోయింది. గులాబీ పార్టీకి గంపగుత్తగా ఓట్లు పడ్డా యి. ఉమ్మడి జిల్లాలో 11 పురపాలక సంఘాల్లో మొత్తం 309 వార్డులుండగా.. 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో10 వార్డులను టీఆర్‌ఎస్‌  దక్కించుకుంది. మరో మూడు వార్డులను ఎంఐఎం తన ఖాతాలో ఏకగ్రీవంగా వేసుకుంది. చెన్నూర్‌లో 7, నిర్మల్‌లో 2, బెల్లంపల్లిలో 1 వార్డు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకోగా.. భైంసాలో ఎంఐఎం 3 వార్డులను ఏకగ్రీవంగా గెలిచింది. దీంతో 296 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 5,52,082 మంది ఓటర్లుండగా..ఈనెల 22న జరిగిన పోలింగ్‌లో 3, 79,814 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు అత్యధికంగా 1,57,190 మంది ఓటు వేశారు. 41.39 శాతం ఓట్లను దక్కించుకుంది. ఒక్క భైంసా తప్ప మిగతా10 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ ప్రథమ స్థానం లో నిలిచింది. ఇక కాంగ్రెస్‌ 80,631 ఓట్లను మాత్ర మే సాధించింది. 22.23 శాతం ఓట్లను మా త్రమే దక్కించుకుంది. చెన్నూరు, భైంసాల్లో కాం గ్రెస్‌కు సీట్ల పరంగా బోణీ కాకపోగా.. ఓట్ల పరంగా కూ డా ఏమాత్రం రాణించలేక పోయింది. చెన్నూర్‌లో కే వలం 332 ఓట్లు రాగా.. భైంసాలో 1220 ఓట్లకే పరిమితమైంది. క్యాతనపల్లిలో2159 ఓట్లు మాత్రమే వచ్చాయి.


కాంగ్రెస్‌, బీజేపీల కంటే టీఆర్‌ఎస్‌కు ఓట్లు అధికం

బీజేపీ 54,107 ఓట్లను మాత్రమే దక్కించుకోగా.. 14.25 శాతానికే పరిమితమైంది. లక్షెట్టిపేటలో 849 ఓట్లు రాగా.. చెన్నూర్‌లో 1312, క్యాతనపెల్లిలో 1363, ఖానాపూర్‌లో 1322 ఓట్లకే పరిమితమైంది. ఒక్కచోట వెయ్యిలోపు, మూడు చోట్ల 1500లోపు ఓట్లకే పరిమితమైంది. సీట్ల పరంగా ఆరు మున్సిపాలిటీల్లో మంచిర్యాల, చెన్నూర్‌, లక్షెట్టిపేట, క్యాతన్‌పెల్లి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌లో అసలు బోణీయే చేయలే దు. ఎంఐఎం 23,396 ఓట్లు రాగా.. 6.16 శాతం ఓట్లను సాధించింది. నస్పూర్‌, లక్షెట్టిపేట, క్యాతన్‌పెల్లిలో పోటీ చేయకపోగా.. ఖానాపూర్‌లో 12 ఓట్లు, మంచిర్యాలలో 151 ఓట్లు, బెల్లంపల్లిలో 41, కాగజ్‌నగర్‌లో 453 ఓట్లు మాత్రమే వచ్చాయి. భైంసా, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో మాత్రం సీట్లతోపాటు కొంత మేర ఓట్లను కూడా సాధించింది. ఇతర పార్టీలు 9, 211 ఓట్లను సాధించగా.. 2.43 శాతం ఓట్లు పడ్డా యి. స్వతంత్రులు 47,500 ఓట్లు రాగా.. 12.51 శాతం ఓట్లను సాధించారు. నోటాకు 1,966 ఓట్లు రాగా.. 0.52 శాతంగా ఉంది. చెల్లని ఓట్లు 5,813 ఉండగా.. 1.53 శాతంగా నమోదైంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు రెండింటికీ కలిపి 11 మున్సిపాలిటీల్లో 36.48 శాతం ఓట్లు రాగా.. ఒక్క టీఆర్‌ఎస్‌కే 41.39 శాతం ఓట్లు వచ్చాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన పది వార్డులు వేరుగా ఉండనే ఉన్నాయి. ఈ లెక్కన రెండు పార్టీల కంటే టీఆర్‌ఎస్‌కు ఐదు శాతం అధికంగా ఓట్లు వచ్చాయి.


logo