శుక్రవారం 05 జూన్ 2020
Mancherial - Jan 29, 2020 , 04:12:13

‘ఇంటర్‌' ప్రాక్టికల్స్‌కు రెడీ

‘ఇంటర్‌' ప్రాక్టికల్స్‌కు రెడీ

ఇంటర్మీడియెట్‌ ప్రయోగ పరీక్షలు(ప్రాక్టికల్స్‌) ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. జిల్లాలో నాలుగు విడుతలుగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. 6,413 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో జనరల్‌ విభాగంలో 3,131 మంది.. ఒకేషనల్‌ విభాగంలో 3,282 మంది ప్రయోగ పరీక్షలు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఇంద్రాణి వెల్లడించారు.

  • ఫిబ్రవరి 1 నుంచి నాలుగు విడుతలుగా నిర్వహణ
  • 27 పరీక్షా కేంద్రాలు, 6,413 మంది విద్యార్థులు
  • ఉదయం, మధ్యాహ్నం పరీక్ష సమయాలు
  • నిఘా నీడలో ప్రయోగ పరీక్షలు
  • సర్వం సిద్ధం చేసిన ఇంటర్‌ విద్యాశాఖ

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లుచేసింది. ఫిబ్రవరి 1 నుంచి పరీక్షలు ప్రారంభం కా నుండగా జిల్లాలో 27 కేంద్రాల్లో నిర్వహించనుంది. ఇంటర్‌ బోర్డు నిబంధనల ప్రకారం సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు వీడియో రికార్డింగ్‌ చేయనున్నా రు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్‌ జరిగే కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లోనైతే ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్‌ సూపరింటెండెంట్లుగా, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లోనైతే జిల్లా ఆయా పరీక్ష కేంద్రాల ప్రిన్సిపాళ్లు చీఫ్‌ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తా రు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్చరర్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు పర్య వేక్షిస్తారు. జిల్లా పరీక్షల కమిటీ(డెక్‌)లో ఉండే అధికారులు డీఐఈవో ఇం ద్రాణి, ఎలీ షా దేవీ(మంచిర్యాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌), అంజయ్య (బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌) పర్యవేక్షిస్తారు.


 అరగంట ముందు పరీక్షా పత్రం..

పరీక్షకు అరగంట ముందు ఎగ్జామినర్‌కు ఇంటర్‌బోర్డు నుంచి ఓటీపీ వస్తుంది. దీనితో ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం డౌన్‌లోడ్‌ చేసుకొని విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పూర్తైన గంటలోపు ఆన్‌లైన్‌లో మార్కులు అప్‌లోడ్‌ చేస్తారు. ఎగ్జామినర్‌కు కళాశాలల నుంచి ఒక సహాయకుడిని ఏర్పాటుచేస్తారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మ ధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 14 ఉండగా, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు 13 ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యుత్‌శాఖ, ఆర్టీసీ, పోలీస్‌,పోస్టల్‌ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఇంటర్‌ విద్యాశాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయనున్నారు. కలెక్టర్‌ భారతి హోళికేరి వివిధ శాఖల అధికారులకు సమన్వయంతో పనిచేసి పరీక్షలు పకడ్బందిగా జరిగేందుకు అందరు కృషి చేయాలని ఆదేశించారు.


నాలుగు విడతలుగా జరిగే పరీక్ష కేంద్రాలు

ఈ పరీక్షలు నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. మొదటి విడత ఒకటి నుంచి పది వరకు, రెండో విడత ఆరో తేదీ నుంచి పది వరకు, మూడో విడత 11 నుంచి 15 వరకు, నాలుగో విడత 16 నుం చి 20 వరకు నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ విధానం ఎంతో మేలు చేస్తుందని పలువురు చెబుతున్నారు. ప్రశ్నలు ఎలా వస్తాయన్నది అధ్యాపకులకు కూడా తెలియదు. దీంతో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యం అడ్డగోలు మార్కులు వేసే పద్ధతి తప్పనుంది.


పరీక్షా కేంద్రాలివే..

మొదటి విడతలో 7 పరీక్ష కేంద్రాలు ఉండగా అందులో లక్షెట్టిపేట గర్ల్స్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల, మంచిర్యాల మోడల్‌ స్కూల్‌ - జూనియర్‌ కళాశాల, లింగాపూర్‌ మోడల్‌ స్కూల్‌ - జూనియర్‌ కళాశాల, మంచిర్యాలలోని చైతన్య జూనియర్‌ కళాశాల, మందమర్రిలోని అందుగులపేట సింగరేణి గర్ల్స్‌ జూనియర్‌ కళాశాల, బెల్లంపల్లిలోని భారతి జూనియర్‌ కళాశాల, లక్షెట్టిపేటలోని ఉమామహేశ్వరి జూనియర్‌ కళాశాల.


రెండవ విడతలో 7 పరీక్ష కేంద్రాలు ఉండగా జైపూర్‌ జూనియర్‌ కళాశాల, జన్నారం జూనియర్‌ కళాశాల, దండేపల్లి జూనియర్‌ కళాశాల, మందమర్రిలోని మోడల్‌ స్కూల్‌-జూనియర్‌ కళాశాల, మంచిర్యాలలోని శ్రీహర్ష జూనియర్‌ కళాశాల, జన్నారం కరిమల జూనియర్‌ కళాశాల, ఊత్కూర్‌ వాగేశ్వర జూనియర్‌ కళాశాల.

మూడో విడతలో 8 పరీక్ష కేంద్రాలుండగా చెన్నూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మంచిర్యాలలోని మిమ్స్‌ జూనియర్‌ కళాశాల, మంచిర్యాలలోని ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, మంచిర్యాలలోని ప్రతిభ జూనియర్‌ కళాశాల, మంచిర్యాలలోని అల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాల, బెల్లంపల్లిలోని ప్రగతి జూనియర్‌ కళాశాల.


నాలుగో విడతలో ఐదు పరీక్ష కేంద్రాలుండగా ఇందులో మంచిర్యాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మందమర్రి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కాసిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మంచిర్యాలలోని మిమ్స్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి.


logo