శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Jan 28, 2020 , 02:19:02

దారులన్నీకెస్లాపూర్‌కే..

దారులన్నీకెస్లాపూర్‌కే..
  • జాతరకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు
  • నాగోబాను దర్శించుకున్న మాజీ ఎంపీ నగేశ్‌

దారులన్నీ కెస్లాపూర్‌వైపే సాగుతున్నాయి.. అతిపెద్ద గిరిజన జాతరకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నాగోబాను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు.  కెస్లాపూర్‌ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  జాతరలో ఏర్పాటు చేసి రంగుల రాట్నాలు, దుకాణాల వద్ద సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా బస్సురవాణా సౌకర్యం కల్పించారు. సోమవారం నాగోబాను మాజీ ఎంపీ నగేశ్‌, ప్రొఫెసర్‌ కోదండరాం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

-ఇంద్రవెల్లి విలేకరి


logo