మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Jan 30, 2020 ,

నేడే పట్టణాభిషేకం

నేడే పట్టణాభిషేకం
  • బల్దియా చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • మొదట కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
  • ఎన్నికకు ఏర్పాట్లు చేసిన అధికారులు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలలో నేడు చివరి ఘట్టం ముగి యనుంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్లతో పాటు కౌన్సి లర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలో నస్పూర్‌ మినహా, అన్నింటిలో టీఆర్‌ఎస్‌ స్పష్ట మైన ఆధిక్యత సాధించింది. నస్పూర్‌లో కూడా కేవలం విజయానికి మూడు సీట్ల దూరంలో ఆగిపోగా, అక్కడ కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థే చైర్మన్‌ గా ఎన్నిక కానున్నారు. స్వతంత్రులు మద్దతు ప్రక టించడంతో ఉత్కంఠ వీడింది. ఉదయం 10 గం టలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యా హ్నం 12:30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఇప్పటికే టూర్లలో ఉన్న కౌన్సిలర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు నేటి ఉదయానికి జిల్లాకు చేరుకుంటారు. చైర్మన్‌ ఎన్ని కలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చైర్మన్ల ఎన్నిక సజావుగా సాగ నుంది. టీఆర్‌ఎస్‌ అన్ని మున్సిపాలిటీలలో విజ యకేతనం ఎరగవేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు. బెల్లంపల్లి మినహా అన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక ఖరారైంది.  

మంచిర్యాల చైర్మన్‌గా పెంట రాజయ్య

మంచిర్యాల మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా టీఆర్‌ఎస్‌ 21, కాంగ్రెస్‌ 14, స్వతంత్రు లు ఒకటి గెలవడంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ పూర్తి ఆధిక్యత చూపింది. ఎమ్మెల్యే సన్నిహితుడు 8వ వార్డు కౌన్సిలర్‌ పెంట రాజయ్యను చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించారు. బీఫాంలు ఇచ్చిన వెంట నే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. వైస్‌ చైర్మన్‌గా 34వ వార్డు అభ్యర్థి మాదంశెట్టి సత్య నారాయణ పేరు ఖరారు చేసినట్లు సమాచారం.  

హంగయినా.. టీఆర్‌ఎస్‌దే పీఠం

నస్పూర్‌ మున్సిపాలిటీలో సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పీఠం ఎక్కనున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ విజయానికి ముగ్గురు కౌన్సిలర్లు అవసరం ఉండగా స్వతంత్రులు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించడంతో సస్పెన్షన్‌ వీడింది. మొత్తం 25 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌ 10, కాంగ్రెస్‌ 6, బీజే పీ 3, ఇతరులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు, ఎంపీ వెంకటేశ్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చర్చలు జరప డంతో స్వతంత్రులుగా పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ముగ్గురు మద్దతుకు అంగీకరించారు. దీనితో 9వ వార్డు కౌన్సిలర్‌ ఈసపల్లి ప్రభాకర్‌ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి (స్వతంత్య్ర)తోట శ్రీనివాస్‌ వైస్‌ చైర్మన్‌గా మొదటి రెండున్నరేళ్లు, ఆ తర్వాత రెండున్నరేళ్ళు వంగ తిరుపతి పనిచేయనున్నారు. నేతల సమక్షంలో ఒప్పందం కుదిరింది.

సాఫీగా లక్షెట్టిపేట ఎన్నిక

లక్షెట్టిపేటలో సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండానే చైర్మన్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ 15 స్థానాలు ఉండగా 9 టీఆర్‌ఎస్‌, 5 కాంగ్రెస్‌, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇప్పటికే చైర్మన్‌ అభ్యర్థిగా నలమాసు కాంతయ్యను ప్రకటించారు. వైస్‌ చైర్మన్‌గా పోడేటి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక కాను న్నారు. స్వతంత్య్ర అభ్యర్థి సైతం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ఇక్కడ ఎన్నిక సాఫీగా సాగనుంది. 

బెల్లంపల్లి అంతా సస్పెన్స్‌

బెల్లంపల్లిలో చైర్మన్‌ ఎవరనేది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరు అనేది బయటకు రాలేదు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన తండ్రి మరణించడంతో ఇంటికి పరిమితం అయ్యారు. దీంతో చైర్మన్‌ అభ్యర్థి వివరాలు ఎవరు బయటకు చెప్పడం లేదు. ఐతే చైర్మన్‌ అభ్యర్థిగా జక్కుల శ్వేత పేరును ఖరారు చేసినట్లు సమాచారం. వైస్‌ చైర్మన్‌ రేసులో ఏకగ్రీవంగా ఎన్నికైన బత్తుల సుదర్శన్‌, బొడ్డు నారాయణ, గెల్లి రాజలింగు ఉన్నారు. 


logo