మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jan 25, 2020 , 03:24:33

లింగు స్వామికి మొక్కులు

లింగు స్వామికి మొక్కులు


కాసిపేట: వెంకటాపూర్‌ గ్రామ పంచాయ తీ, కుర్రేఘడ్‌లోని ఆదివాసీల ఆరాధ్య దైవం పాహండి కుపర్‌ లింగు స్వామి జాతర శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే జాతరలో  మొదటి రోజు  సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలతో పాటు జెండా ఆవిష్కరణ, అగ్ని గుండం, భజన నిర్వహించారు. శనివా రం ప్రధాన పూజ, మాల విరమణ, దర్బార్‌, ఆదివారం ప్రత్యేక పూజలతో ముగింపు కార్యక్రమం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తె లిపారు. మొదటి రోజు కార్యక్రమానికి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. ఓసీసీ అధ్యక్షుడు ఎస్‌కే పాండే హాజరయ్యారు. పూజారి కుర్సిం గ భూదేషావ్‌, కార్య నిర్వాహణ అధ్యక్షుడు ఆడె శంకర్‌, కార్యదర్శి పెంద్రం హన్మంతు, ఉపాధ్యాక్షులు ఆడె జంగు, పెంద్రం రాజు, కోట్నాక తిరుపతి, కార్యదర్శులు వెడ్మ కిషన్‌, సిడం గణపతి, పెంద్రం ప్రభాకర్‌, కనక రాజు, సోయం జంగులున్నారు.logo