శుక్రవారం 29 మే 2020
Mancherial - Jan 25, 2020 , 03:21:45

క్రీడలకు అధిక ప్రాధాన్యత

క్రీడలకు అధిక ప్రాధాన్యత


శ్రీరాంపూర్‌: క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఐ బిల్ల కోటేశ్వర్‌, ఎస్‌ఐ మంగీలాల్‌ అన్నారు. ప్రగతి స్టేడియంలో ఉమ్మడి జిల్లా జూనియర్‌ జట్ల ఎంపిక పోటీలు శుక్రవారం నిర్వహించారు. సీఐ, ఎస్‌ఐ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. అ నంతరం వారు మాట్లాడుతూ కబడ్డీకి గ్రామీణ క్రీడగా గుర్తింపు ఉందని ప్రోకబడ్డీతో ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్ర స్థాయి కబ డ్డీ పోటీల్లో పాల్గొని రాణించాలని కోరారు. జూనియర్‌ కబడ్డీ బాల, బాలికల పోటీలకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని కబడ్డీ ఆసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసంపెల్లి రాంచందర్‌, ఉపాధ్యక్షుడు మల్లెత్తుల రాజేంద్రపాణి పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులకు 30 వరకు శిక్షణ శిబిరం ఉంటుందని తెలిపారు. 30, 31, ఫిబ్రవరి 1 వరకు జనగామ లో జరిగే 46వ రాష్ట్ర స్థాయి కబడ్టీ పోటీల్లో జట్టు పాల్గొంటుందన్నారు. టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, పీఈఐఈలు కార్తీక్‌, రాజశేఖర్‌, సదానందం, శరత్‌, రవీందర్‌, టీబీజీకేఎస్‌ నాయకులు క్రిష్ణారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.


logo